17న దివంగత తల్లికి ప్రధాని మోదీ పిండ ప్రదానం | PM Modi To Perform Pind Dan For His Late Mother, More Details Inside| Sakshi
Sakshi News home page

17న దివంగత తల్లికి ప్రధాని మోదీ పిండ ప్రదానం

Sep 9 2025 9:22 AM | Updated on Sep 9 2025 10:28 AM

PM Modi to Perform Pind dan for Late Mother

న్యూఢిల్లీ: బీహార్‌లోని గయలో జరుగుతున్న పితృపక్ష మేళాకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. సెప్టెంబరు 17న ప్రధాని మోదీ గయ చేరుకుని, దివంగత తన తల్లికి పిండప్రదానం చేయనున్నారు. అలాగే తన పూర్వీకులకు తర్పణాలు అర్పించనున్నారు.

ఈ పర్యటనలో ప్రధాని మోదీ రోడ్‌షో నిర్వహించడంతోపాటు పూర్ణియా విమానాశ్రయాన్ని, పట్నా మెట్రోను ప్రారంభించనున్నారు. ప్రధాని రాక సందర్భంగా పట్నా జిల్లా అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పోలీసులు సమన్వయంతో వివిధ ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు పితృపక్ష మేళాకు పోలీసు అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా పట్నా మెట్రో బీహార్ అభివృద్ధిలో ఒక మైలురాయి కానుంది. ప్రధాని మోదీ పర్యటన వివరాలను ప్రధాని కార్యాలయం ఇంకా ధృవీకరించనప్పటికీ, పలు సూచనల మేరకు బీహార్‌ అధికారులు ‍ప్రధాని రాకకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement