breaking news
pinda pradanalu
-
17న దివంగత తల్లికి ప్రధాని మోదీ పిండ ప్రదానం
న్యూఢిల్లీ: బీహార్‌లోని గయలో జరుగుతున్న పితృపక్ష మేళాకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. సెప్టెంబరు 17న ప్రధాని మోదీ గయ చేరుకుని, దివంగత తన తల్లికి పిండప్రదానం చేయనున్నారు. అలాగే తన పూర్వీకులకు తర్పణాలు అర్పించనున్నారు.ఈ పర్యటనలో ప్రధాని మోదీ రోడ్‌షో నిర్వహించడంతోపాటు పూర్ణియా విమానాశ్రయాన్ని, పట్నా మెట్రోను ప్రారంభించనున్నారు. ప్రధాని రాక సందర్భంగా పట్నా జిల్లా అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పోలీసులు సమన్వయంతో వివిధ ఏర్పాట్లు చేస్తున్నారు.మరోవైపు పితృపక్ష మేళాకు పోలీసు అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా పట్నా మెట్రో బీహార్ అభివృద్ధిలో ఒక మైలురాయి కానుంది. ప్రధాని మోదీ పర్యటన వివరాలను ప్రధాని కార్యాలయం ఇంకా ధృవీకరించనప్పటికీ, పలు సూచనల మేరకు బీహార్ అధికారులు ప్రధాని రాకకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘పిండే’యడమే ‘ప్రధానం’
రాజమండ్రి/కొవ్వూరు: ఎడారిలో సైతం ఇసుకను అమ్మే నైపుణ్యం కొందరు వ్యాపారుల సొంతం. అలాంటివారు పుష్కరాల వంటి మహదవకాశాన్ని వదులుకుంటారా! అందుకే గడ్డి పరకకు, వరి పిండికి కూడా అడ్డగోలుగా ధరలు నిర్ణయించేసి భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పుష్కరాల్లో పిండ ప్రదానాల నిర్వహణకు అవసరమైన దర్భగడ్డి, వరి పిండి అమ్మకాలతో భారీగా ఆర్జిస్తూ భక్తుల నమ్మకాన్ని కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. భక్తులు పితృదేవతలకు పిండాలు సమర్పించే వస్తువులకు భారీగా వసూళ్లు చేస్తున్నప్పటికీ కార్యక్రమం నిర్వహించేందుకు ఖర్చులు భరిస్తున్నారు.