అన్నదాతలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం తీపికబురు

PM-KISAN scheme: Govt to transfer 19000 crore to farmers accounts - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీ.ఎం-కిసాన్) పథకం కింద 8వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ మే నెల 14వ తేదీన దృశ్య మాధ్యమం ద్వారా విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా  9.5 కోట్లకు పైగా లబ్ధిదారులైన రైతు కుటుంబాలకు రూ.19 వేల కోట్లకు పైగా నిదులను బదిలీ చేయనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి రైతు లబ్దిదారులతో సంభాషించనున్నారు. ఈ కార్యక్రమానికి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా హాజరుకానున్నారు. 

పీఎం-కిసాన్‌ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు, నాలుగు నెలలకు ఒకసారి రూ.2వేల చొప్పున మూడు సమాన వాయిదాల్లో ఏడాదికి రూ.6 వేల మేర ఆర్థిక ప్రయోజనాన్ని కేంద్రం అందిస్తోంది. ఈ నిధి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. ఈ పథకం కింద ఇంతవరకు మొత్తం 1.15 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ నగదును రైతు కుటుంబాలకు బదిలీ చేయడం జరిగింది.

చదవండి:

పీఎం కిసాన్ అర్హుల జాబితాలో మీ పేరు ఉందా?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top