పీఎం కిసాన్ డబ్బులు మీ ఖాతాలో పడ్డాయా?

PM Kisan 7th Installment Money not Received, Here is what you need to do - Sakshi

న్యూఢిల్లీ: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క 7వ విడత రూ.2000 కోసం మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. పీఎం నరేంద్ర మోడీ తన చేతుల మీదుగా డిసెంబర్ 25న 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.18000 కోట్లు జమ చేశారు. ఈ సమయంలో 6 రాష్ట్రాలకు చెందిన రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా తక్కువ వడ్డీకే రుణాలను వస్తున్నాయని, వీటి గురుంచి మిగతా రైతులకు కూడా తెలియజేయాలని పేర్కొన్నారు. 

అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల డబ్బు ఇప్పటివరకు మీ ఖాతాలోకి రాకపోతే మీరు వెంటనే ఫిర్యాదును దాఖలు చేయాలి. దీని కోసం ముందు మీ ఖాతా యొక్క స్టేట్‌మెంట్‌ను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద డబ్బును పొందడానికి తప్పని సరిగా మీ పేరు 7వ విడత జాబితాలో ఉందొ లేదో ముందుగా తెలుసుకోవాలి. ఒకవేల కనుక జాబితాలో మీ పేరు లేకపోతె పీఎం కిసాన్ సమ్మన్ యొక్క హెల్ప్‌లైన్ నంబర్‌ 011-24300606కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.  

1. మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలంటే ముందుగా అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in ని ఓపెన్ చేయండి.
2. మీకు అక్కడ హోమ్ పేజీలో ఫార్మర్ కార్నర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 
3. మీకు అక్కడ కనిపించే బెనెఫిషరీ లిస్ట్ పై క్లిక్ చేయాలి. 
4. ఇప్పుడు లబ్ధిదారుల జాబితాపై క్లిక్ చేసి మీ రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామ పేరును ఎంటర్ చేయండి. 
5. ఈ వివరాలను పూర్తీ చేసిన తరువాత 'గెట్ రిపోర్ట్' పై క్లిక్ చేసి మీ పేరు జాబితాలో ఉందొ లేదో తెలుసుకోండి.

మీ పేరు కనుక 7వ విడుత జాబితాలో ఉంటే మీ ఖాతాలోకి పీఎం కిసాన్ డబ్బులు కొద్దీ రోజుల్లో వచ్చి చేరుతాయి. ఒకవేల కనుక 7వ విడత జాబితాలో పేరు లేకపోతే క్రింద చెప్పిన హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.    
 
హెల్ప్‌లైన్ నంబర్లు:

  • పీఎం కిసాన్ టోల్ ఫ్రీ నంబర్: 18001155266
  • పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్: 155261PM 
  • కిసాన్ ల్యాండ్‌లైన్ నంబర్లు: 011—23381092, 23382401
  • పీఎం కిసాన్ యొక్క కొత్త హెల్ప్‌లైన్: 011-24300606PM 
  • కిసాన్‌కు మరో హెల్ప్‌లైన్ ఉంది: 0120-6025109
  • ఇమెయిల్ ఐడీ: pm kisan-ict@gov.in
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top