భయపడాల్సిన పనిలేదు: కిరణ్‌ రిజిజు | Opposition Agreed To Back Govt's Decision On West Asia Crisis At All Party Meet Kiren Rijiju, More Details Inside | Sakshi
Sakshi News home page

భయపడాల్సిన పనిలేదు: కిరణ్‌ రిజిజు

Mar 25 2026 8:33 PM | Updated on Mar 26 2026 12:03 PM

 Opposition agreed to back govt's decision on West Asia crisis at all-party meet Kiren Rijiju

న్యూఢిల్లీ: పశ్చిమాసియా పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిందని, ప్రతిపక్ష నాయకులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యలలోనూ తాము అండగా నిలుస్తామని ప్రతిపక్ష పార్టీలన్నీ తమకు హామీ ఇచ్చాయని తెలిపారు. 

దాదాపు రెండు గంటలపాటు కొనసాగిన సమావేశం జరిగిందని కిరణ్‌ రిజిజు అన్నారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇంధన సంక్షోభం నుంచి బయటపడేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వం వివరించిదని తెలిపారు. ‘దేశీయంగా 60% ఎల్పీజీని ఉత్పత్తిని పెంచాం. ఇంధన సరఫరా పెంచేందుకు అన్ని దేశాలతో చర్చలు జరుపుతున్నాం. 

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలన్ని అఖిలపక్ష పార్టీలకు వివరించాము. సవాళ్లు ఎదురవుతున్న ఈ సమయంలో, అందరూ కలిసికట్టుగా ఉండాలని నిర్ణయించాము. దేశంలో ఇంధన భద్రతకు ఢోకా లేదు ఇంధన భద్రత విషయంలో భయపడాల్సిన పనిలేదు.  విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మద్దతిస్తామని అన్ని పార్టీలు వెల్లడించాయి. హార్మూజ్ జలసంధి నుంచి భారత నౌకలు సురక్షితంగా వస్తున్నాయి’ అని అన్నారు.

కాగా, ఇవాళ జరిగిన అఖిలపక్ష సమావేశం పార్లమెంటులో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ తరఫున సమావేశానికి  ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement