Omicron Effect: మరోసారి నైట్‌ కర్ఫ్యూ.. రాత్రి 9నుంచి ఉదయం 6 వరకు

Omicron: Maharashtra Govt Imposes Section 144 from 9 pm to 6 am - Sakshi

రాత్రి 9నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ

కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం

వివాహాలు, ఇతర కార్యక్రమాలపై కూడా ఆంక్షల విధింపు

సాక్షి ముంబై: రాష్ట్రంలో మరోసారి కరోనా మహమ్మారి ముఖ్యంగా నూతన వేరియంట్‌ ఒమిక్రాన్‌ హడలెత్తిస్తోంది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలను విధించాలని నిర్ణయం తీసుకుంది. ఈమేరకు రాష్ట్రంలో మరోసారి నైట్‌ కర్ఫ్యూ విధించింది. రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయనున్నారు. కర్ఫ్యూ నిర్ణయం శుక్రవారం రాత్రి నుంచే అమలు చేస్తున్నట్టు మంత్రి అనీల్‌ పరబ్‌ ప్రకటించారు. దీంతోపాటు పలు ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. అయితే ఎన్ని రోజులపాటు ఈ నైట్‌ కర్ఫ్యూ అమలు చేస్తారనేది మాత్రం తెలియరాలేదు. ఇతర ఆంక్షలకు సంబంధించిన మార్గదర్శకాలు ప్రభుత్వం విడుదల చేయనుంది.

ముఖ్యంగా క్రిస్మస్‌ వేడుకలు, నూతన సంవత్సర వేడుకలపై మరోసారి కరోనా ప్రభావం పడిందని చెప్పవచ్చు. గత కొన్నినెలలుగా తగ్గుతూ వచ్చిన కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. ముఖ్యంగా గత మూడు రోజులు పరిశీలిస్తే రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య మరోసారి వేయి దాటుతోంది. శుక్రవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1,410 నమోదుకాగా, మరో వైపు ఒమిక్రాన్‌ కేసులు సైతం 20 నమోదయ్యాయి. ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య రాష్ట్రంలో 100 దాటింది. దీంతో రాష్ట్రంలో మరోసారి కఠిన ఆంక్షలను విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  

చదవండి: (Omicron Effect: నూతన సంవత్సర వేడుకలు రద్దు!)

మళ్లీ మూతపడనున్న పాఠశాలలు? 
కరోనా నూతన వేరియంట్‌ ఒమిక్రాన్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో తెరిచిన పాఠశాలలు మళ్లీ మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పలు ప్రాంతాల్లోని పా ఠశాలల్లో పలువురు విద్యార్థులకు ఇప్పటికే కరోనా సోకడంతో ఆయా పాఠశాలలను మూసివేయడం తోపాటు అక్కడ అందరికీ కరోనా పరీక్షలు చేస్తున్నా రు. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తం గా తెరిచిన పాఠశాలలను కొన్ని రోజులపాటు మూసివేయాలనే అంశంపై ఆలోచిస్తున్నామని మంత్రి వర్షా గైక్వాడ్‌ తెలిపినట్టు సమాచారం. దీంతో పాఠశాలలు మళ్లీ మూతపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే అలాంటి నిర్ణయం ఏదీ ఇంకా ప్రకటించలేదని, అధిక కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో స్థానిక అధికారులు జిల్లా అధికారులు, నిర్ణయాలు తీసుకుంటారని చెబుతున్నారు. 

నూతన ఆంక్షలు.. 
మహారాష్ట్రలో బహిరంగ ప్రదేశాలలో నైట్‌ కర్ఫ్యూ సమయంలో అయిదుగురికి కంటే ఎక్కువ మంది గుమిగూడటంపై నిషేధం.  
హాలులో పెళ్లికి హాజరయ్యేవారి సంఖ్య 100 మందికి మించకూడదు.  ూ బహిరంగ ప్రదేశా లలో జరిగే పెళ్లిళ్లకు 250 లేదా స్థలం సామర్థ్యం బట్టి 25 శాతం మందికి మాత్రమే అనుమతి . 
వివాహ వేడుకలు కాకుండా ఇతర వేడుకల కోసం హాల్‌లలో 50 శాతం, బహిరంగ స్థలాల్లో సామర్థ్యాన్ని బట్టి 25 శాతం మించకూడదు.  
హోటళ్లు, జిమ్‌లు, స్పా, సినిమా హాళ్లు, ఆడిటోరియాలు తదితర ప్రాంతాల్లో కూడా 50 శాతం మందికే అనుమతి.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top