అసలే పక్షవాతం, ఆపై విషసర్పం వాటేసుకుంది..వీడియో చూస్తే వణుకే! | Odisha Venomous snake wraps around paralysed man traps for 2 hours | Sakshi
Sakshi News home page

అసలే పక్షవాతం, ఆపై విషసర్పం వాటేసుకుంది..వీడియో చూస్తే వణుకే!

Jun 1 2026 1:13 PM | Updated on Jun 1 2026 2:05 PM

Odisha Venomous snake wraps around paralysed man traps for 2 hours

శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా  కుట్టదన్నట్టు భయంకరమైన విషసర్పం రెండు గంటలు ఒళ్లంతా చుట్టేసినా సురక్షితంగా బయటపడ్డాడో వ్యక్తి.  ఒడిశాలోని బౌధ్ జిల్లా అదెనిగఢ్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పక్షవాతం కారణంగా కదలలేని స్థితిలో ఉన్న వ్యక్తి రెండు గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని గడిన ఘటన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.  ఎట్టకేలకు ఆయన ప్రాణాలతో బయటపడటం అద్భుతమని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.

ఏం జరిగిందీ అంటే..
హరభంగ బ్లాక్ పరిధిలోని అదెనిగఢ్ గ్రామానికి చెందిన కృష్ణ చంద్ర సాహు. ఈయన పక్షవాతం (Paralysis) బాధపడుతున్నాడు. అర్ధరాత్రి సమయంలో ఆయన తన ఇంట్లో పడుకుని ఉండగా, తెరిచి ఉన్న కిటికీ లోంచి ఒక విషసర్పం గదిలోకి ప్రవేశించింది. ఆ తర్వాత నెమ్మదిగా పాకుకుంటూ వచ్చి గాధనిద్రలో  ఉన్న సాహు ఒంటి మీదికి చేరింది.  శరీరంపైఏదో పాకుతున్నట్టు గమనించిన సాహు  అసలు విషయం తెలిసి  తీవ్ర భయాందోళనలకు లోనయ్యాడు. కానీ  పక్షవాతం కారణంగా కదల్లేని స్థితిలో  ఉన్న ఆయన అక్కడి నుండి త్వరగా తప్పించుకోలేకపోయాడు. ఆ గందరగోళంలో పాము ఆయన చేతికి, అలాగే పక్కనే ఉన్న కుర్చీకి కలిపి గట్టిగా చుట్టుకు పోయింది. ఆ దృశ్యాన్ని చూసిన కుటుంబ సభ్యులు కూడా  తీవ్ర భయాందోళనలకు గురయ్యాడు.ఏం చేయాలో అర్థం  కాలేదు. కానీ తొందరపడి మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాము చేసే ఏ చిన్న పొరపాటు జరిగిన అతని ప్రాణాలకే  ప్రమామని గ్రహించి, చాలా జాగ్రత్తగా వ్యవహరించారు.

 

ఇదీ చదవండి: కారు కోసం వేధింపులు : విగత జీవిగా ఇన్‌ఫ్లూయెన్సర్‌

రెండు గంటల ఉత్కంఠ
దాదాపు రెండు గంటల పాటు తీవ్ర ఉత్కంఠ నడుమ ఎట్టకేలకు సాహును పాము పట్టు నుండి కృష్ణ చంద్ర సాహును సురక్షితంగా విడిపించారు.  అనంతరం ఆ పామును పట్టుకుని ఇంటి వెలుపల సురక్షిత ప్రాంతంలో వదిలేశారు. ఈ  క్రమంలోసాహుకు హాని ఇతర కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి హాని జరగపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.  ఈ కాలంలో మండించే ఎండలు,  వర్షాకాలంలో పాములు ఆశ్రయం కోసం ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉన్నందున, కిటికీలు, తలుపులు జాగ్రత్తగా మూసి ఉంచాలని స్థానికులు హెచ్చరించారు.

ఇదీ చదవండి: ప్రియురాలి కోసం సరిహద్దు దాటాడు.. కట్‌ చేస్తే

Advertisement
 
Advertisement
Advertisement