కారు కోసం వేధింపులు : విగత జీవిగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ | Dowry harassment: Wanted Car Lucknow Influencer tragedy | Sakshi
Sakshi News home page

కారు కోసం వేధింపులు : విగత జీవిగా ఇన్‌ఫ్లూయెన్సర్‌

Jun 1 2026 11:20 AM | Updated on Jun 1 2026 11:36 AM

Dowry harassment: Wanted Car Lucknow Influencer tragedy

వరకట్న వేధింపులకు మరో యువతి బలైంది. లక్నోలో ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ (మాన్సి) తన అత్తవారింట్లో స్థితిలో కన్నుమూసింది. అదనపు కట్నంగా కార్ ఇవ్వలేదనే అక్కసుతోనే మాన్సి భర్త సాగర్ రాజ్‌పుత్, అతని కుటుంబ సభ్యులు ఆమెను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించడానికి మృతదేహాన్ని ఉరితీశారని మాన్సి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

పోలీసులు నమోదు చేసిన ప్రథమ సమాచార నివేదిక (FIR) ప్రకారం, కాన్పూర్‌కు చెందిన  ఇన్‌ఫ్లుయెన్సర్  మాన్సికి, 2024లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్  సాగర్ రాజ్‌పుత్‌తో వివాహం జరిగింది. వీరిద్దరూ సోషల్ మీడియాలో చురుకుగా ఉండేవారు, రాజ్‌పుత్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 8 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

పెళ్లి సమయంలో మాన్సి కుటుంబం రూ. 7 లక్షల నగదు, ఇతర గృహోపకరణాలను  ఇలా పలు రకాల బహుమతిలిచ్చింది అయినప్పటికీ, తక్కువ కట్నం తెచ్చిందంటూ ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించేవారని, కారు కావాలని ఒత్తిడి తెచ్చారని కుటుంబ సభ్యులు తెలిపారు. పెళ్లైన దగ్గర్నుంచి వేధిస్తూనే ఉండేవారనీ, ఈ వేధింపుల గురించి, తెలిసి పుట్టింటి వారు వారిద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు పలుమార్లు లక్నోకు వెళ్లి మాట్లాడి, సర్ది చెప్పి వచ్చేవారు. 

బాధితురాలి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త సాగర్ రాజ్‌పుత్‌ సహా, మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. అతని తండ్రి రాజేష్, సోదరుడు అను, ఆడపడుచులు బర్ఖా, చాందిని, అత్త ఆశలపై వరకట్న మరణం కేసు నమోదైంది. ప్రస్తుతం  రాజ్‌పుత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తు న్నారు.

గత రెండు వారాలుగా జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచిన భోపాల్ మోడల్ ట్విషా శర్మ వరకట్న మరణం కేసులొ హై-ప్రొఫైల్ CBI దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే, ఈ వరకట్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. లక్నోలోనే జరిగిన  ఇలాంటి మరో కేసులో, శ్వేతా సింగ్ అనే మహిళ మరణానికి సంబంధించి కూడా వరకట్న వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement