పీఎం కిసాన్‌ నిధులు విడుదల | Modi releases PM Kisan funds | Sakshi
Sakshi News home page

పీఎం కిసాన్‌ నిధులు విడుదల

Jun 20 2026 5:37 PM | Updated on Jun 20 2026 6:34 PM

Modi releases PM Kisan funds

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని మోదీ 26వ విడత పీఎం–కిసాన్‌ నిధులను విడుదల చేశారు. శనివారం హూగ్లీ జిల్లా తారకేశ్వర్‌ పర్యటనలో ఉ‍న్న మోదీ బటన్‌ నొక్కి రైతులకు డబ్బులు రిలీజ్  చేశారు.  దీంతో దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం కిసాన్‌కు సంబంధించిన రూ. 2 వేలు అకౌంట్లలో జమ‍య్యాయి. ఈ పథకం ద్వారా మెుత్తంగా 9.44 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.18,880 కోట్లు జమయ్యాయి. 

2019లో ఈ పథకం ప్రారంభం కాగా ఇప్పటివరకు మొత్తం రూ.4.46 లక్షల కోట్లను రైతులకు సాగు  సాయంగా విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. ఏటా మూడు విడతలలో ఈ డబ్బును  అందజేస్తుంది. పీఎం కిసాన్‌ ద్వారా ఒక్కో రైతుకు మెుత్తం రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం అందుతుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement