మరో వందేభారత్‌కు ప్రధాని మోదీ పచ్చజెండా.. ఎ‍ప్పుడంటే? | PM Modi To Inaugurate Indias Long Distance Vande Bharat Train Between Ajni And Pune, More Details Inside | Sakshi
Sakshi News home page

మరో వందేభారత్‌కు ప్రధాని మోదీ పచ్చజెండా.. ఎ‍ప్పుడంటే?

Aug 9 2025 11:53 AM | Updated on Aug 9 2025 12:55 PM

Modi to Inaugurate Indias Longest Running Vande Bharat

న్యూఢిల్లీ: భారతదేశపు అత్యంత దూరం ప్రయాణించే తొలి వందే భారత్ రైలును ప్రధాని మోదీ మహారాష్ట్రలో ప్రారంభించనున్నారు. ఈ వందే భారత్ రైలు మొత్తం 881 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది.  ఈ రైలుకు మొత్తం 10 స్టాప్‌లు ఉంటాయి. సగటున 73 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది.

నాగ్‌పూర్‌లోని అజ్ని- పూణే మధ్య దీర్ఘ దూరం నడిచే వందే భారత్ రైలు మహారాష్ట్ర ప్రజలకు  అందుబాటులోకి రానుంది. ఇది రాష్ట్రంలోని 12వ వందే భారత్ రైలుగా నిలవనుంది. ఆగస్టు 10న ప్రధాని నరేంద్ర మోదీ ఈ రైలును ప్రారంభించనున్నారు. రైలు నంబర్లు 26101/26102. ఆగస్టు 11 నుండి పూణే స్టేషన్ నుండి,  ఆగస్టు 12 నుండి అజ్ని స్టేషన్ నుండి తన సాధారణ సేవలను ప్రారంభించనుంది. ఈ రైలు వారానికి ఆరు రోజులు రాకపోకలు సాగించనుంది.

మహారాష్ట్రలోని ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు,సాధారణ ప్రయాణాలు  సాగించేవారికి  ఈ రైలు ప్రయోజనకరంగా ఉండనుంది. ఈ రైలు వార్ధా, బద్నేరా, అకోలా, షెగావ్, భూసావల్, జల్గావ్, మన్మాడ్, కోపర్గావ్, అహ్మద్ నగర్ , దౌండ్ కార్డ్  స్టేషన్లలో ఆగనుంది. ఎనిమిది కోచ్‌లతో.. ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్,  ఏడు స్టాండర్డ్ చైర్ కార్లు, మొత్తం 590 మంది ప్రయాణీకులకు కూర్చునేందుకు ఈ రైలు అవకాశం కల్పిస్తుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement