కోబ్రాకే గురిపెట్టి.. పాయింట్‌ బ్లాక్‌ రేంజ్‌లో కాల్పులు ఆ తర్వాత.. | Sakshi
Sakshi News home page

Viral Video: కోబ్రాపై పాయింట్‌ బ్లాక్‌ రేంజ్‌లో కాల్పులు.. అంతే బుస్సుమంటూ జర జర వచ్చి.

Published Wed, Dec 28 2022 5:34 PM

Man Firing Gun At Snake From Point Blank Range Goes Viral  - Sakshi

వైరల్‌: పాములకు సంబంధించిన చాలా వీడియోలు చూశాం. కానీ ఈ వీడియోలోని సన్నివేశం మాత్రం సినిమాల్లోనే చూశాం గానీ రియలిస్ట్‌గా సాధ్యం కాదు. నిజంగా పాములపై కాల్పులు జరిపితే కోపంతో వెంటాడి మరీ కాటేస్తాయా! అనుకుంటాం. ఔను! అనిపించేలా ఆ వీడియోలోని వ్యక్తి రియల్‌స్టిక్‌గా చేసి చూపించాడు. ఒక వ్యక్తి కారులో కూర్చొన ఉన్నట్లు వీడియోలో. ఎదురుగా కోబ్రా ఉంటుంది.

మనోడు ఏకంగా కోబ్రాకే పాయింట్‌ బ్లాక్‌లో గురి పెట్టి కాల్చేందకు ప్రయత్నించాడు. ఐతే రెండు రౌండ్డలు కాల్చాడు గానీ, అవి గురి తప్పాయి. అంతే కోబ్రాకి కోపం వచ్చి కస్సు బుస్సుమంటూ జరజర అతడిని భయభ్రాంతులకు గురి చేసేలా మీదకు దూసుకువచ్చింది. ఆ తర్వాత ఆ వ్యక్తికి ఏమైందన్నది తెలియరాలేదు. అందుకు సంబంధించిన వీడియోకి 'కోబ్రాతో ఫైట్‌కి దిగాలనుకుంటే తుపాకీతో దిగొద్దు' అనే క్యాప్షన్‌ని జోడించి మరీ పోస్ట్‌ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీంతో నెటజన్లు కోబ్రా రెండే ఛాన్సులు ఇస్తుంది, మరో ఛాన్స్‌ అదే తీసుకుంటుంది అని కామెంట్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు.
వీడియో కోసం క్లిక్‌ చేయండి
 

(చదవండి: ఒంటిపై అండర్‌వేర్‌ తప్ప నులుపోగులేదు ..అలానే దొంగలను పరిగెత్తించాడు)

Advertisement
 
Advertisement