 
													ఢిల్లీ: సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్య కాంత్ నియమితులయ్యారు. కేంద్ర న్యాయశాఖ.. నియామక ఉత్తర్వులు వెలువరించింది. నవంబర్ 24న ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 9, 2027 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన కొనసాగనున్నారు. కాగా, నవంబర్ 23వ తేదీన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పదవీ విరమణ చేయనున్నారు.
జస్టిస్ సూర్యకాంత్ హరియాణాలోని హస్సార్ జిల్లాలో ఓ మధ్య తరగతి కుటుంబంలో 1962 ఫిబ్రవరి 10న జన్మించారు. 2019 మే 24న సుప్రీంకోర్టులో జడ్జిగా పదోన్నతి పొందారు. ఈయన దాదాపు 15 నెలలపాటు సేవలందించి 2027 ఫిబ్రవరి 9వ తేదీన రిటైర్ అవుతారు. సూర్యకాంత్.. హర్యానాలోని కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు.
1984లో న్యాయవాదిగా హర్యానా & పంజాబ్ హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 2004లో హైకోర్టు న్యాయమూర్తిగా.. 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతేకాదు.. ఎన్‌ఏఎల్‌ఎస్‌ఏ (National Legal Services Authority) కార్యనిర్వాహక ఛైర్మన్‌గా ఇటీవల ఈయన నియమితులయ్యారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
