జేఈఈ మెయిన్‌ పరీక్షలు వాయిదా | JEE-Mains postponed due to surge in Covid cases | Sakshi
Sakshi News home page

జేఈఈ మెయిన్‌ పరీక్షలు వాయిదా

Apr 19 2021 6:23 AM | Updated on Apr 19 2021 6:23 AM

JEE-Mains postponed due to surge in Covid cases - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌: ఈ నెల 27, 28, 30 తేదీల్లో నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వాయిదా వేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈసారి నాలుగు విడతల్లో జేఈఈ మెయిన్‌ను నిర్వహించేందుకు ఎన్‌టీఏ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మొదటి విడత, మార్చి 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రెండో విడత పరీ క్షలను నిర్వహించింది. ఈ పరీక్షలకు ఫిబ్రవరిలో 6,20,978 మంది, మార్చిలో 5,56,248 మంది హాజరయ్యారు. ఇక ఈనెల 27, 28, 30 తేదీల్లో మూడో విడత, మే నెలలో నాలుగో విడత పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఈనెల పరీక్షలను వాయిదా వేస్తు న్నట్లు వెల్లడించింది. మళ్లీ పరీక్షలను ఎప్పుడు నిర్వహించాలనేది తరువాత నిర్ణయిస్తామని, పరీక్షకు 15 రోజుల ముందుగా తెలియజేస్తా మని వెల్లడించింది. వివరాలను వెబ్‌సైట్‌లో  అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement