ప్రియుడి కోసం పాక్‌ చెక్కేసిన అంజూ..మళ్లీ వార్తల్లోకి, స్టోరీ ఏంటంటే?

Indian Woman Anju Went To Pak To Marry Facebook Friend To Come Home Soon - Sakshi

ప్రియుడి కోసం పాకిస్తాన్‌ వెళ్లిన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అంజూ అలియాస్‌ ఫాతిమా గుర్తుందా.  ఈ ఫాతిమా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. భర్త, ఇద్దరు పిల్లల్ని వదిలేసి మరీ పాక్‌లోని మారుమూల గ్రామానికి వెళ్లి ఫేస్‌బుక్ స్నేహితుడిని పెళ్లాడిన అంజూ త్వరలోనే భారతదేశానికి రానుంది. అంజూ తన పిల్లల్ని కలిసేందుకే భారత్ వెళ్లేందుకు పాక్‌ ప్రభుత్వం అనుమతి పొందేందుకు ప్రయత్నిస్తోందని స్వయంగా   ఆమె భర్త నస్రుల్లా  వెల్లడించారు.

పాకిస్తాన్ ప్రభుత్వం నుండి అనుమతి పొందిన తర్వాత ఇంటికి తిరిగి వస్తుందని  నస్రుల్లా చెప్పారు. తాము ఇస్లామాబాద్‌లో  విదేశీ మంత్రిత్వశాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం ఇప్పటికే  దరఖాస్తు చేసుకున్నామని, ఈ ప్రక్రియ కొంచెం ఆలస్యమైనప్పటికీ, అది రాగానే అంజూ భారత్ వెళుతుందని నస్రుల్లా తెలిపారు. భారత్‌లో ఉన్న తన పిల్లల్ని కలిసిన తర్వాత ఆమె  తిరిగి పాకిస్తాన్‌కు వస్తుందన్నారు. (ఇన్ఫీ నారాయణ మూర్తికి, రాధికా గుప్తా స్ట్రాంగ్‌ కౌంటర్‌

కాగా ఫేస్‌బుక్‌లో పరిచయమైన నస్రుల్లా కోసం పాకిస్తాన్ వెళ్లింది అంజూ. అయితే తమది ప్రేమలేదు దోమా లేదు..పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని ముందు చెప్పినప్పటికీ ఆ తరువాత ఇస్లాంలోకి మారి ఫాతిమాగా పేరు మార్చుకుంది. అనంతరం వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం, దీనికి సంబంధించిన వీడియో కూడా బయటికి రావడం ప్రస్తుతం సంచలనంగా మారడం తెలిసిందే. ఆగస్టులో ఈమె వీసానుమరో ఏడాది పాటు పొడిగించింది. అయితే నస్రుల్లాతో ప్రేమ, పెళ్లికి ముందే అంజూకి రాజస్థాన్‌కు చెందిన అరవింద్‌తో  పెళ్లయింది. వీరికి 15 ఏళ్ల కుమార్తె, 6 ఏళ్ల కుమారుడు ఉన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top