ఆర్థిక రంగంలో నూతన ఒరవడులు | Sakshi
Sakshi News home page

ఆర్థిక రంగంలో నూతన ఒరవడులు

Published Sat, Jul 30 2022 1:16 AM

India among countries that shape global financial trends says PM Narendra modi - Sakshi

గాంధీనగర్‌/సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రపంచ ఆర్థిక రంగంలో నూతన ఒరవడులను సృష్టించే దేశాల సరసన భారత్‌ నిలిచిందని ప్రధాని మోదీ చెప్పారు. ఈ ఘటన సాధించిన దేశ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ అగ్రగామి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత్‌..ప్రస్తుత, భవిష్యత్‌ పాత్రను పోషించగల సంస్థలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

శుక్రవారం గాంధీనగర్‌ సమీపంలో ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌ సెంటర్స్‌ అథారిటీ(ఐఎఫ్‌ఎస్‌సీఏ) శంకుస్థాపన అనంతరం గుజరాత్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ టెక్‌(గిఫ్ట్‌)లో ప్రధాని ప్రసంగించారు. గిఫ్ట్‌ ఏర్పాటు ద్వారా అంతర్జాతీయ ఆర్థిక సేవల్లో భారత్‌ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే రియల్‌ టైం డిజిటల్‌ పేమెంట్స్‌లో భారత్‌ వాటా 40% వరకు ఉందన్నారు.

విద్యార్థులు దేశ ప్రగతికి సారథులు
నేటి విద్యార్థులు రేపటి దేశ ప్రగతికి సారథులుగా నిలవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. చెన్నై గిండిలోని అన్నా యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవంలో ఆయన విశిష్ట అతిథిగా హాజరై ప్రసంగించారు. తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి అధ్యక్షతన జరిగిన స్నాతకోత్సవంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని 69 మంది విద్యార్థులకు బంగారు పతకాలను ప్రదానం చేశారు.

ప్రపంచం మొత్తం భారతీయ యువతను గమనిస్తోందని, వారే దేశాభివృద్ధిలో కీలకమన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం ద్వారా అన్నా యూనివర్సిటీకి ప్రపంచ స్థాయి పేరు ప్రఖ్యాతులు లభించాయన్నారు. కరోనా కాలంలో దేశం ఎదుర్కొన్న అనేక సవాళ్లకు, విద్యావేత్తలు, వైద్య నిపుణులు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రతి ఒక్కరి వల్లే పరిష్కారం లభించిందన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement