కేజ్రీవాల్ అరెస్ట్‌పై ECకి ఇండియా కూటమి ఫిర్యాదు | India Alliance complains to EC Over Arvind Kejriwal Arrest | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్ అరెస్ట్‌పై ECకి ఇండియా కూటమి ఫిర్యాదు

Mar 22 2024 8:53 PM | Updated on Mar 22 2024 9:27 PM

India Alliance complains to EC Over Arvind Kejriwal Arrest - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీఆల్‌ అరెస్ట్‌పై  ఇండియా  కూటమి భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈడీ అధికారాన్ని అధికార పార్టీ  బీజేపీ దుర్వినియోగం చేస్తోందని  ఫిర్యాదులో పేర్కొంది. ఎన్నికల కోడ్ సమయంలో ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేసి జైల్లో వేస్తున్నారని మండిపడింది.

ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, ఆ పార్టీ సీనియర్‌ నేత, ప్రముఖ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ, కూటమిలోని అన్ని పార్టీల ప్రతినిధులు కలిసి శుక్రవారం భారత ఎన్నికల సంఘాన్ని కలిశారు. కేంద్రం ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈడీ, సీబీఐ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలను వేధిస్తోందని ఇండియా కూటమి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

సమావేశం అనంతరం అభిషేక్‌ మనుసింఘ్వి మీడియాతో మాట్లాడారు. ‘ఢిల్లీ ముఖ్యమంత్రిని గురువారం అర్థరాత్రి అరెస్ట్‌ చేశారు. అధికార పార్టీ తీరుపై ఎన్నికల సంఘంతో సమగ్రంగా చర్చించాం. ఇది ఒక వ్యక్తికి, పార్టీకి సంబంధించిన అంశం కాదు, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు సంబంధించిన అంశం.

భారత దేశ చరిత్రలో సిట్టింగ్ ముఖ్యమంత్రిని అరెస్ట్‌ చేయడం ఇదే తొలిసారి. కేంద్రం వైఖరిపై జోక్యం చేసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరాం. ప్రతిపక్షాలపై కక్ష సాధింపు కోసం బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఏవిధంగా దుర్వినియోగం చేస్తుందో ఆధారాలతో సహా వివరించాం. ఎన్నికల సందర్భంగా డీజీపీని, సెక్రెటరీని మార్చే మీరు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఎందుకు కంట్రోల్‌ చేయలేరని ఎన్నికల సంఘాన్ని అడిగాం’ అని పేర్కొన్నారు.
చదవండి: Delhi Liquor Case: కవితకు జైలా? బెయిలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement