కల్తీ మద్యానికి 5 గురు బలి.. మరో 22 మంది..

Hooch Tragedy  Aligarh : 5 Dead 22 Hospitalised After Consuming Spurious Liquor - Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్​లో దారుణం చోటుచేసుకుంది. కల్తీ మద్యం సేవించిన వారిలో 5 గురు చనిపోగా, మరో 22 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స తీసుకుంటున్నారు. వివరాలు.. అలీఘడ్​ జిల్లాలో గత కొన్ని రోజులుగా పోలీసులకు తెలియకుండా మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. అయితే, వారు పోలీసుల దాడులకు భయపడి మద్యాన్ని రోహెరా గ్రామంలోని  ఒక చెరువులో పారబోశారు.

దీన్ని చూసిన కొంత మంది ఇటుక బట్టీ కూలీలు ఈ కల్తీ మద్యాన్ని తాగారు. కాగా,  వీరందరు గత రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన తెలియగానే స్థానిక పోలీసులు బాధితులందరిని జవహర్​లాల్​ నెహ్రు మెడికల్​ కాలేజ్​ ఆసుపత్రిలో చేర్చారు. కాగా,  కల్తీ మద్యం బాధితులలో ఇప్పటి వరకు 5 గురు చనిపోయారని,  మరో 22 మంది బాధితుల ప్రాణాలను కాపాడటానికి  ప్రయత్నిస్తున్నామని డాక్టర్​ హరిస్​ మంజుర్​ తెలిపారు.

అయితే, వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అన్నారు. ఈరోజు ఉదయం వరకు (గురువారం) 27 మంది ఆసుపత్రిలో చేరారని తెలిపారు. ఇలాంటి  పరిస్థితిలో మొదటి ఆరు గంటలు బాధితులకు ఎంతో విలువైందని డాక్టర్​ మంజుర్​ పేర్కొన్నారు. వీరిలో చాలా మంది శాశ్వతంగా చూపును కోల్పోయారని, మరో 13 మంది తీవ్రమైన కంటి సమస్యలతో బాధపడుతున్నారని యూపీ మెడికల్​ ఆఫీసర్​ భానుప్రతాప్​ తెలిపారు.

మెడికల్​ కాలేజ్​ కంటి డాక్టర్​ జియా సిద్ధిఖీ మాట్లాడుతూ.. వీరిలో ఆరుగురు తీవ్రమైన కంటి సమస్యలతో బాధపడుతుండగా, మరో 2 సరిగ్గా చూడలేకపోతున్నారు. మిగతా 4 కోలుకుంటున్నారని తెలిపారు. అయితే,  మరికొంత మంది బాధితులు స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో కూడా చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. ఈ ఘటనలో బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మెడికల్​ ఆఫీసర్​ పేర్కొన్నారు.   

గత నెల మే 28 న ఇలాంటి ఘటనే జరిగింది. అప్పుడు, 35 మంది మరణించారు.  ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల నుంచి చనిపోయిన వారిలో  87 మందిని పరీక్షించగా వారంతా..  కల్తీ మద్యం కారణంగానే చనిపోయానట్లు తెలింది. అప్పటి, కేసులో 34 మందిని అరెస్ట్​ చేశామని పోలీసులు తెలిపారు. దీనిపై మరింత దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని  యూపీ పోలీసులు పేర్కొన్నారు. 
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top