
చండీగఢ్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కుమారి సెల్జాను బీజేపీలో చేరాల్సిందిగా కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత మనోహర్ లాల్ ఖట్టర్ ఆహ్వానించారు.
ప్రముఖ దళిత నేత కూడా అయిన సెల్జా వచ్చే నెలలో జరిగే హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారన్న వార్తల నేపథ్యంలో మంత్రి ఈ ఆఫర్ ఇవ్వడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా సీఎం అభ్యర్థి ఎవరనే విషయమై రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతర్గత పోరు తీవ్రతరమైందని మంత్రి ఖట్టర్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఘరువాండాలో జరిగిన ఎన్నికల కార్యక్రమంలో మాట్లాడారు.