బీజేపీ ప్లాన్‌ సక్సెస్‌.. గోవాలో కాంగ్రెస్‌ ఖాళీ! | Sakshi
Sakshi News home page

బీజేపీ ప్లాన్‌ సక్సెస్‌.. గోవాలో కాంగ్రెస్‌ ఖాళీ!

Published Wed, Sep 14 2022 1:12 PM

Goa Congress Eight MLAs Join In BJP - Sakshi

గోవాలో రాజకీయం ఒక్కసారిగా ఊహించని ములుపు తిరిగింది. ప్రతిపక్షంలో ఉన్న 8 మంది కాంగ్రెస్‌ నేతలు బీజేపీలో చేరారు. కాగా, బీజేపీలో చేరిన వారీలో మాజీ ముఖ్యమంత్రి దిగంబర్‌ కామత్‌ కూడా ఉండటం విశేషం. 

కాగా, ఎనిమిది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సీఎం ప్రమోద్‌ సావంత్‌ సమక్షంలో బుధవారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారి రాజీనామా లేఖలను స్పీకర్‌కు అందజేశారు. దీంతో, కాంగ్రెస్‌ శాసనసభాపక్షం బీజేపీలో విలీనమైంది. కాగా, ఇది కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై సెటైరికల్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ మాట్లాడుతూ.. దేశంలో కాంగ్రెస్‌ జోడో యాత్ర కాదు.. కాంగ్రెస్‌ చోడో యాత్ర కొనసాగుతోందంటూ ఎద్దేవా చేశారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement