మన్మోహన్‌ సింగ్‌కు కరోనా.. ఎయిమ్స్‌లో చికిత్స‌ | Former PM Manmohan Singh Tested Covid positive, Admitted To AIIMS | Sakshi
Sakshi News home page

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు కరోనా.. ఎయిమ్స్‌లో చికిత్స‌

Apr 19 2021 6:43 PM | Updated on Apr 19 2021 8:43 PM

Former PM Manmohan Singh Tested Covid positive, Admitted To AIIMS - Sakshi

న్యూఢిల్లీ : మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ కరోనా బారిన పడ్డారు. సోమవారం నాడు కరోనా పరీక్షలు నిర్వహించగా ఆయనకు పాజిటివ్‌గా తేలింది. దీంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యారు. ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారు.

కాగా భారత్‌లో కరోనా వైరస్ వేగంగా అత్యంత వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆదివారం మన్మోహన్‌ సింగ్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అయిదు సూచనలు చేస్తూ ఓ లేఖను రాశారు. కరోనా నియంత్రణకు తీసుకొనే చర్యలతో పాటు.. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత వేగవంతం చేయాలని కోరారు.. తన సలహాలు, సూచనలను నిర్మాణాత్మక సహకార స్ఫూర్తితో స్వీకరించాలని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement