గుడ్‌ న్యూస్‌.. ఇక వందే మెట్రో రైళ్లు.. ఈ ఏడాదిలోనే పట్టాలపైకి.. రైల్వే మంత్రి ప్రకటన

Fast Frequent Vande Metro to Connect Major Cities By 2023 End - Sakshi

ఢిల్లీ: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రయాణికుల కోసం గుడ్‌ న్యూస్‌ చెప్పారు. వంద కిలోమీటర్ల పరిధిలో ఉండే ప్రధాన నగరాలను కనెక్ట్‌ చేసేలా మెట్రో రైల్‌ వ్యవస్థ  ‘వందే మెట్రో’ను ఈ ఏడాది చివర్లోనే పట్టాలు ఎక్కించనున్నట్లు ప్రకటించారాయన. 

సుదూర ప్రధాన నగరాలను కనెక్ట్‌ చేస్తూ తీసుకొచ్చిన సెమీ హై స్పీడ్‌ రైళ్లు ‘వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌’ సక్సెస్‌ కావడంతో..  ఇప్పుడు తక్కువ దూరంలోని ప్రధాన నగరాలను అనుసంధానించేలా వందే మెట్రో రైళ్లను తీసుకురాబోతున్నట్లు ప్రకటించారాయన. ఈ ఏడాది చివర్లోనే ఈ రైళ్లు పట్టాలెక్కనున్నాయి.

వందే భారత్‌తో పోలిస్తే వందే మెట్రో డిఫరెంట్‌గా ఉంటుంది. డిసెంబర్‌ కల్లా ఇది సిద్ధమవుతుందని పేర్కొన్నారాయాన. అంతేకాదు.. వందే భారత్‌కు వస్తున్న స్పందనకు అనుగుణంగానే వందే మెట్రోలను తీసుకొస్తున్నట్లు తెలిపారు. అధికారికంగా ప్రకటించకపోయినా.. ఉత్తర ప్రదేశ్‌ కాన్పూర్‌-లక్నో(90 కిలోమీటర్ల దూరం) నడుమ తొలి రైలు పట్టాలెక్కించాలని రైల్వే శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

లోకల్‌ రైళ్ల కంటే మెరుగైన రవాణా అందించే ఉద్దేశంతో వందే మెట్రో తీసుకువస్తున్నట్లు రైల్వేశాఖ చెబుతోంది. వేగంగా, రూట్‌లో ఫ్రీక్వెంట్‌గా సర్వీసులను నడపాలని నిర్ణయించుకుంది. తద్వారా ఉద్యోగులకు, విద్యార్థుల ప్రయాణాలకు వందే మెట్రో ఉపకరించొచ్చని రైల్వే మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ అభిప్రాయపడుతున్నారు. ఎనిమిది కోచ్‌లతో వందే మెట్రో రైళ్లను నడపాలని భావిస్తోంది. ఇప్పటికే చెన్నైలోని ఇంటీగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీకి, లక్నోలోని రీసెర్చ్‌ డిజైన్‌ అండ్‌ స్టాండర్డ్‌ ఆర్గనైజేషన్‌కు రైల్వే శాఖ ఆర్డర్‌లు ఇచ్చినట్లు తెలుస్తోంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top