‘దేశంలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించారా?.. లాక్‌డౌన్‌ విధించబోతున్నారా?’

Digvijay Singh Serious Comments On Mansukh Mandaviya Letter - Sakshi

కరోనా వైరస్‌ టెన్షన్‌ ఇంకా కొనసాగుతోంది. కొద్దిరోజులుగా డ్రాగన్ కంట్రీ చైనాలో కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో, చైనాలో ఇప్పటికే పలు పాంత్రాల్లో లాక్‌డౌన్‌ సైతం విధించి చైనీయులపై అక్కడి సర్కార్‌ ఆంక్షలు సైతం విధించింది. ఈ తరుణంలో కరోనా కేసులు విషయంలో భారత ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. 

కాగా, కరోనా కేసులు పెరుగుతాయనే వైద్య నిపుణుల సూచనలు నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్షుక్‌ మాండవీయా కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రను సైతం వాయిదా వేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగానే భారత్‌ జోడో యాత్ర.. కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ చేసుకోవాలని, టీకా వేసుకున్న వారే ఈ యాత్రలో పాల్గొనాలని.. లేని పక్షంలో యాత్రను వాయిదా వేసుకోవాలని లేఖలో రాహుల్‌ కోరారు. 

ఇక, ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మాండవీయా లేఖపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ స్పందించారు. దిగ్విజయ్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ.. కరోనా విషయంలో దేశంలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించారా?. దేశంలో బహిరంగ సభలు పెట్టకూడదనే షరతు ప్రధాని మోదీతో పాటుగా బీజేపీ నేతలకు వర్తిస్తాయా?. దేశంలో మరోసారి కరోనా లాక్‌డౌన్‌ విధించబోతున్నారా? అంటూ ప్రశ్నలు సంధించారు. 

ఇదిలా ఉండగా.. రాబోయే రోజుల్లో వైరస్‌ కొత్త వేరియెంట్ల ముప్పు పొంచి ఉండడంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్షుక్‌ మాండవియా అధ్యక్షతన బుధవారం అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో వైద్య నిపుణులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని, కేసుల ట్రాకింగ్‌కు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. సీనియర్‌ సిటిజన్లు తప్పనిసరిగా బూస్టర్‌ డోస్‌ వేసుకోవాలని సూచించారు. ఇక, అంతకు ముందు.. పరిస్థితి ఎలాంటిదైనా ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం అంటూ మాండవీయా ట్వీట్‌ చేశారు. ఇక కోవిడ్‌పై ప్రధానంగా జరిగిన  హైలెవల్‌ రివ్యూలో మంత్రితో పాటు అధికారులంతా మాస్కులు ధరించి ఉండడం గమనార్హం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top