Swati Maliwal: మా నాన్న లైంగికంగా వేధించాడు..  మహిళా కమిషన్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..

Delhi Women Commission Chief Swati Maliwal Father Molested Her - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: కన్నతండ్రే తనను బాల్యంలో లైంగికంగా వేధించాడని ప్రముఖ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ ఇటీవల చెప్పడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ కూడా ఇలాంటి విషయాన్నె వెల్లడించడం షాక్‌కు గురిచేస్తోంది.

ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడిన స్వాతి మలివాల్.. కన్నతండ్రే తనను బాల్యంలో లైంగికంగా వేధించాడని చెప్పారు. అతని భయానికి బెడ్ కింద దాచుకునేదానినని దిగ్భ్రాంతికర విషయాన్ని వెల్లడించారు.

'నా చిన్నప్పుడు తండ్రే నన్ను లైంగికంగా వేధించాడు. నన్ను బాగా కొట్టేవాడు. భయంతో వెల్లి మంచం కింద దాచుకునేదాన్ని. జుట్టుపట్టుకుని నా తలను  గోడకేసి బాదేవాడు. దీంతో తల పగిలి రక్తం వచ్చేది. ఓ వ్యక్తిపై ఇలాంటి దాడులు జరిగినప్పుడే అవతలి వాళ్ల బాధ బాగా అర్థం అవుతుంది. ఈ ఆగ్రహ జ్వాల మొత్తం వ్యవస్థనే షేక్ చేస్తుంది. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మహిళలకు ఎలా న్యాయం చేయాలి, చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడిన వారికి గుణపాఠం ఎలా చెప్పాలి అని ప్రతి రోజు ఆలోచించే దాన్ని.' అని స్వాతి మలివాల్ పేర్కొన్నారు. తన నాలుగో తరగతి వరకు తండ్రితోనే ఉన్నానని, చాలా సార్లు తనను వేధించాడని చెప్పారు.

నటి ఖుష్బూ సుందర్ కూడా ఇటీవలే తన తండ్రి లైంగికంగా వేధించాడని చెప్పడం సంచలనం సృష్టించింది. తన 8 ఏళ్ల వయసులోనే ఇది జరిగిందని, అదే తన జీవితంలో అత్యంత కఠినమైన పరిస్థితి అని పేర్కొంది. 15 ఏళ్లు వచ్చాక తన తండ్రిని ఎదిరించినట్లు చెప్పింది. అప్పుడే అతను ఇళ్లు వదిలి వెళ్లిపోయాడని వివరించింది.
చదవండి: నేను వెళ్లిపోతున్నా ఎప్పటికీ తిరిగిరాను అని మెసేజ్.. లవర్‌తో కలిసి కొండపై నుంచి దూకి..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top