Corona Down Fall ​: 7 రాష్ట్రాల్లో వెయ్యిలోపు కేసులు..

Delhi Haryana Among 7 States Where COVID19 Cases Are Less Than 1000: Health Minister - Sakshi

న్యూఢిల్లీ​: దేశంలో కరోనా సెకండ్​వేవ్​ ఉధృతి తగ్గుతోంది. పాజిటివ్‌​ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​ వెల్లడించారు. గడిచిన 24 గంటలలో మన దేశంలోని మధ్యప్రదేశ్​, రాజస్థాన్​, న్యూఢిల్లీ, గుజరాత్​, ఉత్తరాఖండ్​, హర్యానా, జార్ఖండ్​ ఏడు రాష్ట్రాలలో 1,00‌‌0 లోపు కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.

అదే విధంగా జమ్ముకశ్మీర్​, పంజాబ్​, బీహర్​, ఛత్తీస్​ఘడ్, ఉత్తరప్రదేశ్ అయిదు రాష్ట్రాలలో 2,000 కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయని తెలిపారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న మహరాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కూడా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​ అన్నారు.

కరోనా కట్టడికి వైద్యం, ఇతర మౌళిక సదుపాయాల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్వహించిన సమావేశంలో మంత్రి హర్షవర్దన్‌ ఈ వివరాలు వెల్లడించారు. తాజా, లెక్కల ప్రకారం, ఇప్పటి వరకు దేశంలో 2,89,09,975 మంది కరోనా వైరస్‌కు గురికాగా .. 3,49,186 మంది ఈ మహమ్మారి బారిన పడి తమ ప్రాణాలను కోల్పోయారు. ఇక గత 24 గంటల్లో 1,74,399 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 14,01,609 కరోనా కేసులు యాక్టివ్​గా ఉన్నాయని వెల్లడించారు.  

చదవండి​: జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top