ఢిల్లీ మెట్రో స్టేషన్‌ వద్ద అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి | Three Died In Polythene Factory Fire Accident At Delhi Near Rithala Metro Station, Watch Video Inside | Sakshi
Sakshi News home page

ఢిల్లీ మెట్రో స్టేషన్‌ వద్ద అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి

Jun 25 2025 9:15 AM | Updated on Jun 25 2025 10:38 AM

Delhi Fire Accident At Metro Station

సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలో భారీ అ‍గ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రిఠాలా మెట్రోస్టేషన్‌ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వివరాల ప్రకారం.. ఢిల్లీలోని రిఠాలా మెట్రోస్టేషన్‌ సమీపంలో ఉన్న పాలిథీన్‌ ఫ్యాక్టరీలో మంగళవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రాత్రి నుంచి మంటల చెలరేగుతూనే ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని 16 ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement