breaking news
Metro Parking
-
ఢిల్లీ మెట్రో స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. రిఠాలా మెట్రోస్టేషన్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. ఢిల్లీలోని రిఠాలా మెట్రోస్టేషన్ సమీపంలో ఉన్న పాలిథీన్ ఫ్యాక్టరీలో మంగళవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రాత్రి నుంచి మంటల చెలరేగుతూనే ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని 16 ఫైరింజన్లతో మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.#WATCH | Delhi: 3 people died and three were injured after a fire broke out in a polythene factory near the Rithala metro station yesterday at around 7.30 pm, say Delhi police The search operation is still going on.(Morning visuals from the spot) pic.twitter.com/RmMXSE0nef— ANI (@ANI) June 25, 2025 -
మలక్‌పేట్ మెట్రో వద్ద అగ్ని ప్రమాదంలో కుట్ర.. స్పాట్లో పెట్రోల్ డబ్బాలు..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మలక్‌పేట్ మెట్రో స్టేషన్ వద్ద మంటలు చెలరేగడం తీవ్ర కలకలం సృష్టించింది. మంట్లలో ఐదు బైకులు కాలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో, చాదర్ ఘాట్ నుంచి దిల్సుఖ్ నగర్, కోఠి వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.వివరాల ప్రకారం.. మలక్‌పేట్ మెట్రోస్టేషన్ వద్ద అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. మెట్రో స్టేషన్ కింద పార్క్ చేసిన బైకుల వద్ద మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం కారణంగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో, ఐదు బైకులు మంటల్లో కాలిపోయినట్టు సమాచారం. అగ్ని ప్రమాదం కారణంగా కోఠి వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఒక్కసారిగా మంటలు అంటుకుని దట్టమైన పొగ వ్యాపించడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు.ఇక, మలక్‌పేట్ మెట్రో వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో కుట్ర కోణం ఉందని పోలీసులు గుర్తించారు. బైకులు మంటల్లో కాలిపోయిన స్థలంలో పెట్రోల్ డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ ప్రమాదానికి కారణమని తెలిపారు. ఈ క్రమంలో మెట్రోస్టేషన్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. -
పాకిస్తాన్లో టెన్షన్.. ఇమ్రాన్ మద్దతుదారుల అరాచకం
దాయాది దేశం పాకిస్తాన్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులు బుధవారం రెచ్చిపోయారు. నిరసనల్లో భాగంగా మెట్రో స్టేషన్‌కు నిప్పంటించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాల ప్రకారం.. అవిశ్వాస తీర్మానం తర్వాత అధికారం కోల్పోయిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొత్త డిమాండ్‌ను లేవనెత్తారు. పాకిస్తాన్లో ఎన్నికలు జరపాలంటూ డిమాండ్ చేస్తూ తన మద్దతుదారులతో కలిసి బుధవారం ఇస్లామాబాద్‌లో శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ ర్యాలీకి భారీ సంఖ్యలో ఇమ్రాన్ మద్దతుదారులు విచ్చేశారు. ర్యాలీ నేపథ్యంలో పీటీఐ పార్టీ మద్దతుదారులు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. وفاقی دارالحکومت کے مرکزی علاقہ بلیو ایریا میں پی ٹی آئی کارکنان نے درختوں اور گرین بیلٹ کو نذر آتش کردیا pic.twitter.com/nznKg6x5ts — Ghazanfar Abbas (@ghazanfarabbass) May 25, 2022 ఈ క్రమంలో పంజాబ్ ప్రావిన్స్‌లో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి కొందరు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో రెచ్చిన పీటీఐ కార్యకర్తలు, ఇమ్రాన్ మద్దతుదారులు.. చైనా చౌక్ మెట్రోస్టేషన్‌కు, అక్కడున్న చెట్లకు నిప్పంటించారు. కాగా, నిరసనల్లో పీటీఐ పార్టీకి చెందిన ఫైసల్ అబ్బాస్ చౌదరి బట్టి చౌక్ సమీపంలో వంతెనపై నుండి పడి మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఇక, పోలీసులే అబ్బాస్‌ను వంతెనపై నుంచి తోసేశారని పార్టీ నేత షఫ్కత్ మెహమూద్ ఆరోపించారు. Heaving shelling on families in Liberty Lahore !! #PakistanUnderFascism pic.twitter.com/TU4DUTT8L7 — Musa Virk (@MusaNV18) May 25, 2022 ఇది కూడా చదవండి: అమెరికాలో ఉన్మాది కాల్పులు..:19 చిన్నారులు బలి -
32 ప్రాంతాల్లో మెట్రో పార్కింగ్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌వాసుల కలల మెట్రో ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు ముహూర్తం ఖరారుకావడంతో హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రయాణికుల అవసరాలకు తగినట్లు వసతులు కల్పించే అంశంపై దృష్టి సారించింది. సమీప కాలనీలు, ముఖ్య ప్రాంతాల నుంచి ఆయా మెట్రో స్టేషన్లకు చేరుకునే వాహనచోదకులు తమ వ్యక్తిగత వాహనాలను నిలిపేందుకు వీలుగా మొత్తం 64 స్టేషన్లకుగాను 32 చోట్ల పార్కింగ్ సముదాయాలు ఏర్పాటు చేయనుంది. దీనికోసం 17 చోట్ల పార్కింగ్ సదుపాయాలు కల్పించనుంది. మరో 15 ప్రాంతాల్లో బహుళ అంతస్తుల పార్కింగ్ కాంప్లెక్సులు నిర్మించనున్నట్లు ప్రకటించింది. తొలిదశలో నాగోల్– అమీర్‌పేట్, మియాపూర్–ఎస్.ఆర్.నగర్ రూట్లలో ఏడు పార్కింగ్ లాట్లు, మరో 6 చోట్ల పార్కింగ్ కాంప్లెక్సులు ఏర్పాటు చేయనున్నట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు.