విపరీతంగా జనం రావడం వల్లనే.. | Karnataka CM Siddaramaiah Comments On Bengaluru Stampede During RCB Victory Celebrations, More Details Inside | Sakshi
Sakshi News home page

విపరీతంగా జనం రావడం వల్లనే..

Jun 5 2025 7:53 AM | Updated on Jun 5 2025 10:04 AM

Crowd Turned Uncontrollable: Karnataka CM

    దుర్ఘటనపై సీఎం సిద్దు స్పందన

సాక్షి, బెంగళూరు: ఊహించని విధంగా అశేషంగా జనం రావడంతో ఈ దుర్ఘటన జరిగిందని  తొక్కిసలాటపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. కావేరి నివాసంలో మీడియాతో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ ఆర్‌సీబీ విజయోత్సవ ంలో పాల్గొనేందుకు ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రజలు వచ్చారన్నారు. 35 వేల సీట్ల సామర్థ్యం ఉన్న చిన్నస్వామి స్టేడియానికి సుమారు 2 లక్షల నుంచి 3 లక్షల మంది అభిమానులు, ప్రజలు చేరుకోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలిపారు.

 అభిమాన గణం ఒక్కసారిగా లోపలకి చొచ్చుకుని వెళ్లేందుకు యత్నించడంతో ఈ తొక్కిసలాట జరిగిందన్నారు. ఈ ప్రమాదంలో 11 మంది మరణించినట్లు, 33 మంది గాయపడినట్లు వెల్లడించారు. మరో 14 మందికి అతి స్వల్ప గాయా­లైనట్లు చెప్పారు. ప్రభుత్వం తరఫున సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఇంత మంది ఈ కార్యక్రమనికి వస్తారని అస్సలు ఊహించలేదని చెప్పారు. మృతులందరూ యువతేనని, ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం ప్రకటిస్తున్నట్లు తెలిపారు.    

విచారణ జరిపిస్తాం: సీఎం 
ఇలాంటి దుర్ఘటన జరగాల్సినది కాదని, దీనిపై ఉన్న­తస్థాయి విచారణ చేపడతామని, ఒకవేళ భద్రతా లో­పం ఉంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు. బెంగళూరు కలెక్టర్‌ నేతృత్వంలో మెజిస్టీరియల్‌ తనిఖీ  జరుగుతుందన్నారు. విచారణకు 15 రోజులు గడువు ఇస్తానని, నివేదిక అందిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.   

ప్రతిపక్షాల ధ్వజం  
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర, బీజేపీ పక్ష నేత అశోక్‌లు ఆస్పత్రుల్లో బాధితులను పరామర్శించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లనే ప్రాణనష్టం జరిగిందని ఆరోపించారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement