రైల్వే స్టేషన్‌లో పోలీస్ వీరంగం.. వృద్ధుడ్ని తన్ని ఈడ్చుకెళ్లి టార్చర్‌.. వీడియో వైరల్‌

Cop Kicking Elderly Man Madhya Pradesh Jabalpur Railway Station - Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‍లోని జబల్‌పుర్‌ రైల్వే స్టేషన్‌లో ఓ పోలీస్ రెచ్చిపోయాడు. వృద్ధుడు అనే కనికరం కూడా లేకుండా ఓ వ్యక్తిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. అతని మొహంపై పదే పదే తన్నాడు. అంతటితో ఆగకుండా కాళ్లుపట్టి ఈడ్చుకెళ్లి రైల్వే ట్రాక్‌పై వేలాడదీశాడు. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. పోలీసు తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీస్ వృద్ధుడ్ని అంతలా కొడుతున్నా.. ఆపేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. అయితే సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో అధికారులు వెంటనే స్పందించారు. అతడ్ని సస్పెండ్ చేశారు. ఆ పోలీస్‌ పేరు అనంత్ శర్మ అని వెల్లడించారు.

మరోవైపు బాధితుడు గోపాల్ ప్రసాద్‌.. తనను పోలీసు ఎందుకు కొట్టాడో అర్థం కాలేదని తెలిపాడు. తనను ఓ వ్యక్తి తిడుతున్నాడని ఫిర్యాదు చేసేందుకు వెళ్తే విచక్షణా రహితంగా దాడి చేశాడని వాపోయాడు.
చదవండి: ఐదేళ్లుగా నమ్మకంగా ఉంటున్నాడని ఇంటి తాళమిచ్చిన యజమాని.. రూ.10కోట్లతో చెక్కేసిన వ్యక్తి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top