వీడియో: పైశాచికం.. బిడ్డ బాగోగులు చూస్తుందని అనుకుంటే..

MP Baby Sitter Thrashes Kid Police Detained Her After Video Viral - Sakshi

వైరల్‌: ఉద్యోగాల బిజీలో ఉండే తల్లిదండ్రులు.. ఈ వీడియోపై ఓ లుక్కేయండి. తమ బిడ్డ బాగోగులు చూస్తుందని ఓ ఆయాను పెడితే.. ఆమె మాత్రం పైశాచికానికి పాల్పడింది. బిడ్డ ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లిదండ్రులు.. డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్తే అసలు విషయం తెలిసి షాక్‌ తిన్నారు. 

మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌లో దారుణం జరిగింది. రెండేళ్ల బిడ్డను బాగోగులు చూసేందుకు ఓ ఆయాను నియమించుకున్నారు పేరెంట్స్‌. అయితే.. ఎప్పుడు సందడిగా ఉండే ఆ చిన్నారి డల్‌గా మారిపోయాడు. అంతేకాదు.. నీరసంగానూ తయారయ్యాడు. దీంతో బాబుకు ఏమయ్యిందో అని తల్లిదండ్రులు చిన్నారిని వైద్యుల వద్దకు తీసుకెళ్లగా.. చిన్నారి అంతర్గత అవయవాలు వాచిపోయి ఉన్నాయని డాక్టర్ తెలిపాడు. ఎవరో ఆ చిన్నారిని వేధించి ఉంటారని వైద్యుడు వెల్లడించాడు.

దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టారు. ఆఫీసులనుంచి ఇంటికి వచ్చాక.. అందులో రికార్డైన దృశ్యం వారిని ఉలిక్కిపడేలా చేసింది. రజినీ చౌదరిగా గుర్తించబడిన నానీని నెలవారీ రూ. 5,000 ఇచ్చి.. బాబును చూసుకోవడానికి నియమించుకున్నారు. జీతంతో పాటు ఆమెకు భోజనం కూడా పెడుతున్నారు. కానీ, ఆమె మాత్రం చిన్నారిని జుట్టుపట్టి లాక్కెళ్లం, ఈడ్చి చెంపల మీద కొట్టడం, ఇష్టానుసారంగా బాదడం చేసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రజినీ చౌదరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Note: ఈ వీడియోలోని కంటెంట్‌ కొందరిని ఇబ్బందికి గురి చేయొవచ్చు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top