అరుంధతి.. ఆ వీడియో బయటకు రాకుండా చూడు ప్లీజ్..! | College student blackmailed over private video | Sakshi
Sakshi News home page

అరుంధతి.. ఆ వీడియో బయటకు రాకుండా చూడు ప్లీజ్..!

Jun 28 2026 10:53 AM | Updated on Jun 28 2026 11:12 AM

College student blackmailed over private video

చెన్నై: విల్లుపురం జిల్లా, దిండివనానికి చెందిన 20 ఏళ్ల యువతి అక్కడి ఒక కళాశాలలో చదువుతోంది. అదే ప్రాంతంలో నివశించే అరుంధతి అనే నర్సు వారిద్దరూ స్నేహితులు. వారిద్దరూ తరచుగా సెంజి సమీపంలోని అనంతమంగళం శివాలయాన్ని సందర్శిస్తుంటారు. కొన్ని నెలల క్రితం వారు అక్కడికి వెళ్లినప్పుడు, వారిద్దరూ సోషల్‌ మీడియా ద్వారా పరిచయం అయిన ఆది(20) ద్వారా చంద్రు(20) తో పరిచయం ఏర్పడింది. చంద్రు, కళశాల విద్యార్థిని ఒకరినొకరు ప్రేమించుకున్నారని తెలుస్తుంది.  యువ జంట అనంతమంగళంలోని గుడి దగ్గర ఒక ముళ్లపొదల్లో ఏకాంతంగా కలుసుకుని మాట్లాడుకున్నారు. 

తరువాత ఆ విద్యార్థిని చంద్రుతో తనకున్న సాన్నిహిత్యం గురించి తన స్నేహితురాలు అరుంధతికి చెప్పింది. వారిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు ఆది, చంద్రు వీడియో తీశారని అరుంధతి, దానిని సోషల్‌ మీడియాలో ప్రచురిస్తామని వారు బెదిరించారు. దీంతో తాను వారికి డబ్బు చెల్లించి, అంతా సరిచేస్తానని చెప్పింది. ఈ మాటలకు దిగ్భ్రాంతి చెందిన ఆ విద్యార్థిని, తన అమ్మమ్మ ఇంట్లో ఉంచిన రూ.3.5 లక్షలను దొంగిలించి అరుంధతికి ఇచ్చి ఆ వీడియో బయటకు రాకుండా చూడమని చెప్పింది. ఈ స్థితిలో క్యాష్‌ కౌంటర్‌లో ఉన్న డబ్బు గురించి కుటుంబ సభ్యులు ఆరా తీయడంతో నిజం దాచలేనేమోనన్న భయంతో ఆ విద్యార్థిని అధిక మోతాదులో బీపీ మాత్రలు మింగి ఆత్మహత్యకుప్రయత్నించింది. 

ఇది చూసి దిగ్భ్రాంతికి గురైన బంధువులు వెంటనే ఆమెను రక్షించి, చికిత్స కోసం పుదుచ్చేరిలోని జిప్మర్‌ అస్పత్రిలో చేర్పించారు.ఈ సమాచారం అందుకున్న, పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి విద్యార్థినితో ప్రాథమిక విచారణ జరిపారు. ఆ విద్యార్థిని నుంచి బ్లాక్‌మెయిల్‌ చేసి, డబ్బులు వసూలు చేసినట్లు వెల్లడైంది. దీని తర్వాత, బాధితురాలైన కళాశాల విద్యార్థిని నుండి ఫిర్యాదు అందుకున్న పోలీసులు, మనీలాండరింగ్‌కు పాల్పడిన ఆరోపణలపై ఆమె స్నేహితురాలు అరుంధతి, ఆమె ప్రియుడు చంద్రు, ఆది, మరో ముగ్గురిని అరెస్టు చేశారు. అనంతరం, వారిని కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపారు.     

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement