పెళ్లి అంటేనే హడావిడి..సందడిఅందులోనూ రాజకీయ నాయకుడిదైతే ఇక చెప్పేదేముంది. కానీ నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనంగా ఛత్తీస్‌గఢ్‌లోని బెమేతరా (Bemetara) బీజేపీ ఎమ్మెల్యే దీపేష్ సాహు (Deepsh Sahu) వివాహం నిలుస్తోంది. అదీ ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన కింద సామూహికంగా వివాహాలు చేసుకుంటున్న జంటలతో కలిసి, అత్యంత సాదాసీదాగా ప్రభుత్వ ఖర్చులతో పెళ్లి చేసుకోవడం చర్చకు దారితీసింది. నెట్టింట వైరల్‌గా మారింది.
ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించే ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన కింద తరుణా సాహు అనే యువతిని వివాహం చేసుకున్నారు. సామాజిక ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన తరుణా సాహుతో కలిపి దీపేష్ సాహు ఏడు అడుగులు వేశారు. అంతేకాదు వీరి వివాహ ఊరేగింపు విలాసవంత మైన వాహనంలో కాకుండా, ఎద్దుల బండిపై సాగింది. ఈ వివాహ ఊరేగింపులో మరో ప్రత్యేకత ఏమిటంటే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అరుణ్ సాహు స్వయంగా ఎద్దుల బండిపై ప్రయాణించారు. ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ రమణ్ సింగ్ కూడా హాజరై ఆశీర్వచనాలు అందించారు. రాష్ట్రంలో ఈ వివాహ పథకం కింద ఒక ఎమ్మెల్యే వివాహం చేసుకోవడం ఇదే మొదటిసారి.
ఇదీ చదవండి: 65 నిమిషాల్లో 10 వేల అడుగులు : పక్కా లెక్కలతో ఇలా!

తన పెళ్లి కబురును దీపేష్ ట్విటర్‌లో తన అభిమానులతో పంచుకున్నారు.
‘నా లైఫ్ పార్ట్‌నర్‌తో జీవితంలో అత్యంత అందమైన ప్రయాణం ఇప్పుడు మొదలైంది. ప్రతి అడుగులోనూ కలిసి, ప్రతి ఆనందాన్ని పంచుకుంటూ, ప్రతి కష్టంలో ఒకరికొకరు తోడుగా ఉంటూ — ఇదే మా కొత్త ప్రయాణం.’’ అంటూ అందరి ఆశీస్సులు, ప్రేమను కోరుకున్నారు.
“ज़िंदगी का सबसे खूबसूरत सफर, अब मेरे जीवनसाथी के साथ शुरू हुआ है। ✨💛
हर कदम पर साथ, हर खुशी में साझेदारी, और हर मुश्किल में एक-दूसरे का सहारा — यही है हमारा नया सफर। ❤️
आप सभी के आशीर्वाद और प्रेम की अपेक्षा। 🙏#NewJourney #LifePartner #TogetherForever #WeddingVibes pic.twitter.com/LF2WXgnfrO— Dipesh Sahu (@DipeshSahuBJP) May 31, 2026
వివాహాలలో ఆడంబరం, విలాసాలు పెరిగిపోతున్న ఈ కాలంలో, సామూహిక వివాహాలు సమాజానికి ఒక సానుకూల దిశను చూపే చొరవ అంటూ ఎమ్మెల్యే దీపేష్ సాహు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్ ప్రశంసించారు. అనవసరపు ఆడంబరాలకు పోకుండా, వీలైతే ముఖ్యమంత్రి కన్యా వివాహ్ యోజన కింద పెళ్లి చేసుకోవాలని దీపేష్ సాహూకి తానే గతంలో ఆయనకు సూచించానని సీఎం పేర్కొన్నారు. మరోవైపు ఈ పథకం కింద వచ్చిన నిధులను ప్రతిభావంతులైన బాలికా విద్యార్థుల విద్య కోసం ఖర్చు చేస్తానని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు అక్కడ ఇరవై మూడు జంటలకు వివాహాలు జరిగాయి. కాగా వధువు తరుణా సాహు తండ్రి డ్రైవర్, తల్లి గృహిణి.
ఇదీ చదవండి: అసలే పక్షవాతం, ఆపై విషసర్పం వాటేసుకుంది..వీడియో చూస్తే వణుకే!


