3 రోజులు, 10 గంటలు : సీబీఐ విచారణలో ట్విషా భర్త షాకింగ్‌ ఆరోపణలు | CBI To Husband twisha had Bipolar and disorder and health issues | Sakshi
Sakshi News home page

3 రోజులు, 10 గంటలు : సీబీఐ విచారణలో ట్విషా భర్త షాకింగ్‌ ఆరోపణలు

May 26 2026 12:34 PM | Updated on May 26 2026 12:45 PM

CBI To Husband twisha had Bipolar and disorder and health issues

మోడల్ , నటి ట్విషా శర్మ మరణం కేసులో  సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఆమె భర్త సమర్థ్ సింగ్, అత్త (రిటైర్డ్ జడ్జి) గిరిబాల సింగ్‌లపై సీబీఐ కొత్తగా ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేసింది. దీనికి సంబంధించిన కీలక ఆధారాలను సేకరించింది.   ట్విషా శర్మ మృతి కేసు ఇప్పుడు అత్యంత కీలక దశలోకి ప్రవేశించింది.

భోపాల్ పోలీసులు మొదట నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో అత్త, భార్తలను నిందితులుగా చేర్చింది.  సీబీఐ స్పెషల్ క్రైమ్ యూనిట్‌కు చెందిన ఒక బృందం ఢిల్లీ నుంచి భోపాల్ చేరుకుని, స్థానిక పోలీసులు ఇప్పటివరకు సేకరించిన కేస్ డైరీ, పోలీసు పత్రాలు, వాంగ్మూలాలు, వైద్య పత్రాలు, ఇతర భౌతిక సాక్ష్యాలను సేకరించింది.

ఇదీ చదవండి: ట్విషా కేసులో సీబీఐ కోణం : అపుడే అత్త రూ. 2 లక్షలు డిమాండ్‌

ఇప్పటికే  వరకట్నం డిమాండ్‌ చేశారన్న ఆధారాలు లభించినట్లు ఆరోపణలు రావడంతో, వరకట్నం మరణనం సెక్షన్ల కింద కేసులు నమోదు కాగా, సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఎస్‌ఐటి) చీఫ్ రజనీష్ కశ్యప్ కౌల్‌ను ఫిర్యాదిదారుగా పేర్కొన్నారు.

మరోవైపు పోలీసు విచారణలో భర్త సమర్థ్ సింగ్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు, లభించిన ఆధారాలకు మధ్య తేడాలను సీబీఐ గమనించింది. తనకు గర్భం రావడంపై అనుమానంతో, బలంతంగా అబార్షన్‌ చేయించారని ట్విషా వాట్సాప్‌ ద్వారా తెలుస్తుండగా, తనకు తండ్రి కావాలని ఉందని, కానీ ట్విషాకు ఇష్టం లేకపోవడం వల్లే వైద్యుల సలహా మేరకు పరస్పర అంగీకారంతో గర్భస్రావం చేయించామని చెప్పాడు. గర్భం దాల్చినప్పటి నుండి ట్విషా తీవ్ర ఆందోళనకు గురైందని పేర్కొన్నాడు

బైపోలార్ డిజార్డర్
దీంతోపాటు మరో షాకింగ్‌  ఆరోపణలు కూడా చేశాడు భర్త. ట్విషాకు బైపోలార్‌ డిజార్డర్‌  (Bipolar Disorder) 'అడ్జస్ట్‌మెంట్ డిజార్డర్' ఉన్నాయని, ఆమె ప్రవర్తన అకస్మాత్తుగా మారేదని తెలిపాడు. ఒత్తిడి తగ్గించడానికి వైద్యుల సలహా పైనే నిద్రమాత్రలు ఇచ్చామని చెప్పాడు.

ట్విషా కుటుంబం వాదన: పెళ్లికి ముందు ఆమెకు ఎలాంటి సమస్యలు లేవని, గర్భం దాల్చిన తర్వాత వచ్చిన గొడవల వల్లే మానసిక చికిత్స, మందులు మొదలయ్యాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కాలంలో ట్విషా సుమారు 15 కిలోల బరువు తగ్గిందని కూడా  ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అసలు ఈ చికిత్స గురించి  ఆమెకు, పుట్టింటివారికి సమాచారం ఉందా లేదా అనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

ఉద్యోగం మానేయాలని భర్త ఒత్తిడి తెచ్చాడని, కనీసం ఆన్‌లైన్ జాబ్స్‌ కూడా చేసుకోనివ్వడం లేదని ట్విషా చనిపోవడానికి ముందు తన కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ట్విషా తన సొంత ఇష్టపూర్వకంగా, ఇద్దరి పరస్పర అంగీకారంతోనే ఉద్యోగం మానేసిందని, తాము ఎక్కువ సమయం కలిసి గడపడానికే ఈ నిర్ణయం తీసుకుందని సమర్థ్ తెలిపాడు. చనిపోయే రోజు కూడా ఆమె  మామూలుగానే  ఉందనీ,  ఇద్దరమూ  జిమ్‌కు  వెళ్లామని, కలిసి భోజనం చేసి, వాకింగ్‌కు కూడా వెళ్లామని సీబీఐకి చెప్పాడు.

సమర్థ్ పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో పెళ్లయిన కొత్తలో అంతా నార్మల్‌గానే ఉందని, శారీరక, మానసిక వేధింపులేవీ లేవని చెప్పినప్పటికీ, అతని మొబైల్ ఫోన్ నుండి ట్విషాకు, ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించిన వాట్సాప్ చాట్ హిస్టరీ పూర్తిగా డిలీట్ చేశాడు. ఇది మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈ చాట్‌లను రికవర్ చేయడానికి టెక్నికల్ టీమ్ ప్రయత్నిస్తోంది. ఒకవేళ చాట్స్ రికవర్ అయితే, సమర్థ్ చెప్తున్న "నార్మల్ రిలేషన్‌షిప్" వాదనలోని నిజానిజాలు బయటపడే అవకాశం ఉంది అంటున్నారు దర్యాప్తు అధికారులు. 

ప్రస్తుతం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) చీఫ్ రజనీష్ కాశ్యప్ కౌల్ ఫిర్యాదుదారుగా సీబీఐ ఈ కేసును దేశ రాజధాని ఢిల్లీ నుండి ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తోంది. అయితే, దర్యాప్తు చేతులు మారుతున్న కొద్దీ, మూడు రోజులు,  దాదాపు 10 గంటల పాటు జరిగిన విచారణలో సమర్థ్ సింగ్ పోలీసులకు ఏమి చెప్పాడు, వాట్సాప్ చాట్‌లు, వైద్య రికార్డులు,  సీసీటీవీ ఫుటేజీ, ఇతర డిజిటల్ సాక్ష్యాలు, కుటుంబ సభ్యుల ఆరోపణలకు వ్యతిరేకంగా అతని వాదనలో ఎంత నిజం ఉంది అనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement