సాక్షి,న్యూఢిల్లీ: ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్ పెంచేలా 8వ వేతన కమిషన్‌కు కేంద్ర కేబినెట్ మంగళవారం (అక్టోబర్28) ఆమోదం తెలిపింది.
ఇవాళ జరిగిన సమావేశంలో కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎనిమిదవ సెంట్రల్ పే కమిషన్ విధి విధానాలకు(టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్) రూపొందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ఎనిమిదో పే కమిషన్ 18నెలల్లో సిఫారసులు చేయనుంది. పే కమిషన్ సిఫారసుల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచనుంది. కమిషన్ సిఫారసులతో 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. ఎనిమిదో పే కమిషన్ ఛైర్ పర్సన్‌గా జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయి సభ్యులుగా ప్రొఫెసర్ పులక్ ఘోష్ ,పంకజ్ జైన్‌లు వ్యవహరించనున్నారు.
మరోవైపు రబీ సీజన్‌లో న్యూట్రియంట్ ఫర్టిలైజర్స్ సబ్సిడీకి ఆమోదం తెలిపింది. పాస్పెటిక్ , పొటాషిక్, డిఏపి ఫెర్టిలైజర్స్ సబ్సిడీ ఇవ్వనుంది. ఫర్టిలైజర్ సబ్సిడీల కోసం 37,952 కోట్ల రూపాయలను కేంద్రం ఖర్చు చేయనుంది.


