సాక్షి,న్యూఢిల్లీ: ఏపీ విభజనపై బెంగళూరు సౌత్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్ విభజనతో ఏపీ విభజనను పోల్చారు. ఏపీ విభజనను బ్రిటీష్ కంటే చెత్తగా కాంగ్రెస్ చేసింది’ అని వ్యాఖ్యానించారు.
అదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను దక్షిణ రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇదే అంశంపై ఎంపీ తేజస్వీ సూర్య స్పందించారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల తాము సీట్లను, ప్రభావం తగ్గిపోతుందనే భావన దక్షిణాది ప్రాంతాల్లో నెలకొంది. అయితే, ప్రభుత్వం అన్ని రాష్ట్రాల వాటాను 50శాతానికి పెంచుతుంది. తద్వారా ప్రాంతానికి ప్రయోజనం చేకూరుస్తుందని స్పష్టం చేశారు.



