
పట్నా: నేటి తరం యువత ఆధునిక సాంకేతికతను ఆకళింపు చేసుకుని, నూతన ఆవిష్కరణలు చేసేందుకు ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో మన చుట్టుపక్కల దొరికే వస్తువులతోనే నూతన వస్తువులు రూపొందుతున్నాయి. ఇవి చూపరులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నాయి. బీహార్‌కు చెందిన ఒక యువకుడు చేసిన అద్భుతం ఇప్పుడు అందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది.
బీహార్ కుర్రాడు అవనీష్ కుమార్ తనకు ఎటువంటి డిగ్రీ లేకున్నా, అపారమైన సాంకేతిక నైపుణ్యాలను ఆకళింపు చేసుకున్నాడు. పెద్దపెద్ద శాస్త్రవేత్తలే ఆశ్యర్యపోయేలాంటి ఆవిష్కరణను మన ముందుకు తెచ్చాడు. కేవలం చెత్తతో(వ్యర్థాలతో) ఏకంగా విమానాన్ని తయారు చేశాడు. ఇందుకోసం అతనేమీ ఎటువంటి ల్యాబ్ పైనకూడా ఆధారపడలేదు. తగినంత డబ్బులు కూడా లేని అవనీష్ విమానాన్ని తయారుచేసి, దాన్ని విజయవంతంగా ప్రయోగించాడు. ఈ విమానం తయారీకి అవనీష్ కేవలం ఏడు వేల రూపాయలు ఖర్చుచేశాడు.
🚨 Bihar teen Avanish Kumar, has created a flying plane using only scrap in just a week with a cost of around Rs 7,000. pic.twitter.com/Xf2CuAD0dH
— Indian Tech & Infra (@IndianTechGuide) July 28, 2025
దీనికి సంబంధించిన వీడియో అందరినీ అలరిస్తోంది. ఏదో చేయాలన్న తపన ఉండి పట్టుదలతో ప్రయత్నిస్తే అసాధ్యమన్నది ఏదీ ఉండదని అవనీష్ నిరూపించాడు. అవనీస్ రూపొందించిన విమానాన్ని, దానిలో ప్రయాణిస్తున్న అతనిని చూసేందుకు వందలాదిమంది తరలిరావడాన్ని మనం ఈ వైరల్ వీడియోలో చూడవచ్చు. వారంతా అవనీష్‌ను ఉత్సాహపరచడాన్ని గమనించవచ్చు.