బెంగాల్‌ ట్విస్ట్‌: దీదీకి సరికొత్త టెన్షన్‌! | Bengal Election Results: Suvendu PA Incident, BJP, TMC Reactions Updates | Sakshi
Sakshi News home page

బెంగాల్‌ ట్విస్ట్‌: దీదీకి సరికొత్త టెన్షన్‌!

May 7 2026 6:47 AM | Updated on May 7 2026 7:29 PM

Bengal Election Results: Suvendu PA Incident, BJP, TMC Reactions Updates

పశ్చిమ బెంగాల్‌ రాజకీయం మరో మలుపు తిరిగింది. బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడి నెగ్గిందంటూ సీఎం పదవికి రాజీనామా చేసేందుకు మమతా బెనర్జీ నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్రంలో హింస చెలరేగింది. బీజేపీ-టీఎంసీ కార్యకర్తలు వరుసగా హత్యలకు గురవుతుండడం కలకలం రేపుతోంది. తాజాగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సువేందు అధికారి వ్యక్తిగత కార్యదర్శి చంద్రనాథ్‌ హత్యకు గురి కావడంతో రాజకీయ దుమారం రేగింది. 

మమతా బెనర్జీ ప‍్రభుత్వం రద్దు

  • మమతా బెనర్జీ ప‍్రభుత్వాన్ని రద్దు చేసిన గవర్నర్‌
  • మమతా బెనర్జీ రాజీనామా చేయకపోవడంతో నిర్ణయం!
  • 9న పశ్చిమ బెంగాల్‌లో కొలువుదీరనున్న బీజేపీ ప్రభుత్వం  
  • శుక్రవారం (మే 8న) బీజేపీ శాసనసభా పక్ష సమావేశం 

దర్యాప్తు ముమ్మరం

  • సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం
  • ఘటనాస్థలి నుంచి సేకరించిన ఆధారాలను పరిశీలిస్తున్న ఫోరెన్సిక్ టీమ్స్‌
  • ఇప్పటికే బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ సహా ఉన్నతాధికారులు రంగంలోకి
  • మధ్యమ్‌గ్రామ్‌లోని ఘటనాస్థలాన్ని సందర్శించిన ఉన్నతాధికారులు
  • కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని తృణమూల్ డిమాండ్ 
  • పక్షపాతం లేకుండా విచారణ జరగాలన‍్న తృణమూల్‌

అందుకే నా పీఏను చంపారు: సువేందు

  • నా పీఏ చంద్రనాథ్ రాథ్ హత్యకు కారణాలు ఉ‍న్నాయి
  • ఆయన నా కార్యనిర్వాహక సహాయకుడిగా ఉండటమే హత్యకు కారణం
  • భవానీపూర్‌లో మమతా బెనర్జీని నేను ఓడించడమూ ఓ కారణం
  • నా బాధ్యతలన్నింటినీ నేను నిర్వర్తిస్తాను: సువేందు

మమతకు కొత్త తలనొప్పి!

  • ఓడినా సీఎం పదవికి రాజీనామా చేయనంటున్న మమతా బెనర్జీ 
  • దీదీ ప్రకటనతో వేడెక్కిన పశ్చిమ బెంగాల్‌ రాజకీయాలు 
  • నేటితో బెంగాల్‌ అసెంబ్లీ గడువు పూర్తి
  • ఆటోమేటిక్‌గా రద్దు కానున్న టీఎంసీ సర్కార్‌
  • ఈలోపు.. మరో ట్విస్ట్‌!
  • టీఎంసీ భేటీకి డుమ్మా కొట్టిన 10 మంది కొత్త ఎమ్మెల్యేలు
  • పార్టీలో జోష్‌ నింపేందుకు భేటీ నిర్వహించిన మమతా బెనర్జీ
  • 80 మందికిగానూ 70 మందే హాజరు
  • చీలిక ఏర్పడిందా అనుమానాలు
  • పార్టీ ఫిరాయిస్తారని జోరుగా ప్రచారం
  • ఆ ఊహాగానాలను తోసిపుచ్చిన టీఎంసీ 
  • గైర్హాజరుపై ముందుగానే సమాచారం ఇచ్చారని వెల్లడి
  • తాజా పరిణామాలపై బీజేపీ సైలెన్స్‌ 

ఆ పిస్టోల్‌ అక్రమంగా వచ్చిందే!

  • బెంగాల్‌లో సంచలనంగా సువేందు అధికారి పీఏ హత్య కేసు
  • సువేందు పీఏ చంద్రనాథ్‌ రథ్‌ దారుణ హత్య
  • బుధవారం రాత్రి ఇంటికి వెళ్తున్న టైంలో కాల్పులు జరిపిన దుండగులు
  • అక్కడికక్కడే కారులో కుప్పకూలిన చంద్రనాథ్‌
  • చంద్రనాథ్ రథ్‌ హత్యకు ఉపయోగించిన తుపాకీ అక్రమంగా వచ్చిందే!
  • హత్యకు ఆస్ట్రియా మేడ్‌ తుపాకీ వాడిన దుండగలు
  • తుపాకీని బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా తీసుకొచ్చినట్లు గుర్తింపు
  • నిందితులను ట్రేస్‌ చేసే పనిలో కోల్‌కతా పోలీసులు

మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు

  • ఈ నెల 9న బెంగాల్‌ కొత్త సీఎం ప్రమాణ స్వీకారం
  • సీఎం ఎంపిక.. ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై దృష్టి పెట్టిన బీజేపీ
  • టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
  • మే 4వ తేదీన వెలువడ్డ బెంగాల్‌ ఫలితాలు
  • ఫలితాల్లో బీజేపీ ఘన విజయం
  • సీఎం పదవికి ఇప్పటిదాకా రాజీనామా చేయని మమతా బెనర్జీ
  • దేశ రాజకీయాల్లో.. ఇప్పటిదాకా ఎవరూ ఇలా చేయలేదు!
  • సీఎం పదవికి రాజీనామా చేసేది లేదని తేల్చేసిన దీదీ
  • ఏం చేసుకుంటారో చేస్కోమంటూ తాజాగా మరోసారి సవాల్‌
  • కావాలంటే రాష్ట్రపతి పాలన విధించుకోండి అంటూ వ్యాఖ్య
  • సీఎంగా ఎవరైనా ప్రమాణం చేస్తే.. ఆ రోజును బ్లాక్‌డేగా పాటిస్తామని ప్రకటన
  • మరోవైపు.. ఇప్పటికే ముగిసిన బెంగాల్‌ అసెంబ్లీ గడువు
  • రాజ్యాంగం ప్రకారం.. రద్దైన మమతా బెనర్జీ సర్కార్‌
  • అయినా సీఎం కుర్చీలో తానే కూర్చుంటానంటున్న మమతా బెనర్జీ

ఎవరీ చంద్రనాథ్‌?

  • చంద్రనాథ్ రథ్‌.. బీజేపీ నేత సువేందు అధికారికి అత్యంత విశ్వసనీయ సహాయకుడు
  • చంద్రనాథ్‌ వయసు 41 ఏళ్లు.. స్వస్థలం మేదినిపూర్ జిల్లా చందిపూర్ 
  • రహారా రామకృష్ణ మిషన్‌లో చదివిన చంద్రనాథ్‌ 
  • దాదాపు రెండు దశాబ్దాలు భారత వాయుసేనలో సేవలు
  • ఆధ్యాత్మిక జీవితం వైపు ఆకర్షితుడైన.. ఆర్మీ నుంచి వలంటరీ రిటైర్మెంట్‌ 
  • కొంతకాలం రామకృష్ణ మిషన్‌లో సేవలందించిన చంద్రనాథ్‌ 
  • ఆపై కార్పొరేట్ రంగంలో పనిచేసి.. అక్కడ నుంచి పొలిటికల్‌ కన్సల్టెన్సీలో విధులు 
  • తృణమూల్‌ కాంగ్రెస్‌తో చంద్రనాథ్‌ కుటుంబానికి అవినాభావ సంబంధం
  • సువేందు అధికారి బీజేపీలో చేరాక.. ఆయన వెంటే చంద్రనాథ్‌
  • సువేందు కోసం బీజేపీ తరఫున కీలకంగా పని చేసిన చంద్రనాథ్‌
  • అధికారి సువేందు ఎన్నికల ప్రచార నిర్వహణ, పార్టీ కార్యకర్తలతో సంబంధాలు, లాజిస్టిక్స్‌ వంటి సున్నితమైన పనులను హ్యాండిల్‌ చేసిన చంద్రనాథ్‌
  • తాజా విజయంతో.. బీజేపీ చంద్రనాథ్‌కు కీలక బాధ్యతలు అప్పజెప్తుందనే ఊహాగానాలు 
  • ఈలోపే.. చంద్రనాథ్‌ దారుణ హత్య


బెంగాల్‌ను కుదిపేస్తున్న హత్యారాజకీయాలు 

  • ఉత్తర 24 పరగణాలో దారుణ హత్యకు గురైన బీజేపీ రాష్ట్ర చీఫ్‌ అధికారి సువేందు పీఏ చంద్రనాథ్‌
  • తన నివాసానికి వెళ్తున్న టైంలో బైక్‌ మీద వచ్చి కాల్చి చంపిన దుండగులు
  • అక్కడికక్కడే మృతి చెందిన చంద్రనాథ్‌.. డ్రైవర్‌ పరిస్థితి విషమం
  • టీఎంసీపై బీజేపీ ఆరోపణలు.. ఆరోపణలను ఖండించిన టీఎంసీ
  • ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిన హింస
  • హింసాత్మక ఘటనల్లో పలువురు బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మృతి

ఈసీ సీరియస్‌

  • బెంగాల్‌లో హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం సీరియస్‌
  • ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా.. వరుసగా దాడులు, హత్యలు
  • ఇప్పటికే పలువురు టీఎంసీ, బీజేపీ కార్యకర్తలపై దాడులు
  • హత్యకు గురైన పలువురు!
  • బెంగాల్‌ పోలీస్‌ శాఖపై ఈసీ ఆగ్రహం
  • శాంతి భద్రతలు అదుపు తప్పకుండా చూడాలని ఆదేశం
  • ఘటనలపై నివేదిక ఇవ్వాలని బెంగాల్‌ డీజీపీకి ఆదేశం

 


టీఎంసీ స్పందన ఇదే..  

  • ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు
  • చంద్రనాథ్‌ హత్యను ఖండిస్తున్నాం
  • ఆ హత్యతో మాకు సంబంధం లేదు
  • దోషులెవరైనా కఠినంగా శిక్షించాలి
  • కోడ్‌ అమల్లో ఉండగా హింస దురదృష్టకరం
  • చంద్రనాథ్‌ హత్యపై సీబీఐ విచారణ జరగాలి

 

పీఏ హత్యపై సువేందు రియాక్షన్‌

  • మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్‌ బెనర్జీపై సంచలన ఆరోపణలు
  • ఘటనాస్థలాన్ని పరిశీలించిన అధికారి సువేందు
  • పక్కా ప్లాన్‌తోనే నా పీఏను మత్య చేశారు
  • హత్య వెనుక మమతా మేనల్లుడి ప్రమేయం ఉంది

 


సువేందు పీఏ దారుణ హత్య

  • బీజేపీ అధ్యక్షుడు సువేందు అధికారి పీఏ దారుణ హత్య
  • చంద్రనాథ్‌ను కాల్చి చంపిన గుర్తుతెలియని వ్యక్తులు
  • మధ్యమ్‌గ్రామ్‌లో హత్య చేసిన దుండగులు
  • కారులో వెళ్తుండగా కాల్చివేత
  • నాలుగు రౌండ్ల కాల్పులు
  • ఛాతీలో బుల్లెట్లు దూసుకెళ్లి కారులోనే కుప్పకూలిన చంద్రనాథ్‌
  • కారులో ఉన్న మరో వ్యక్తికి గాయాలూ.. పరిస్థితి విషమం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement