స్వతంత్ర భారతి: బోఫోర్స్‌ కుంభకోణం

Azadi Ka Amrit Mahotsav: Rajiv Gandhi And Bofors Scandal - Sakshi

బోఫోర్స్‌ శతఘ్నుల కొనుగోలుకు జరిగిన లావాదేవీలలో రాజీవ్‌ గాంధీకి సన్నిహితులైనవారికి భారీ మొత్తంలో ముడుపులు ముట్టాయని వెల్లడి కావడం ప్రతిపక్షాలకు ఆయుధంగా ఉపయోగపడింది. అప్పటి వరకు యువ ప్రధాని రాజీవ్‌ గాంధీకి మిస్టర్‌ క్లీన్‌ అనే పేరు ఉండేది. బోఫోర్స్‌ ముడుపుల గురించి వెల్లడి కావడంతోనే ఆ మంచి పేరు కాస్తా తుడిచిపెట్టుకుపోయింది.

64 కోట్ల ఆ బోఫోర్స్‌ ముడుపుల కుంభకోణం నేటికీ దేశంలోని అవినీతికి ఒక ప్రతీకగా నిలిచిపోయింది. దర్యాప్తులు జరగడం, చార్జిషీట్లు దాఖలు అవడం, లెటర్‌ రొగేటరీలు జారీ అవడం జరిగినా వాస్తవంగా దోషులెవ్వరో ఇంతవరకు రుజువు కాలేదు. ఈ కేసు దేశంలో నేరస్థులకు శిక్ష వేయడంలో న్యాయ వ్యవస్థ వైఫల్యానికి కూడా నిదర్శనంగా నిలిచింది. కాంగ్రెస్‌ను అనునిత్య భయపెట్టిన ఈ కుంభకోణం రాజకీయ అవినీతి నిఘంటువులో అంతర్భాగంగా చిరకాలం నిలిచిపోతుంది.

ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు
124 అత్యద్భుతమైన ఇన్నింగ్స్‌ కలిగి ఉన్న గవాస్కర్‌  10,000 పరుగుల మైలురాయిని చేరుకున్నారు. 
బ్యాంకు చెక్కుల క్లియరెన్సుకు ‘మేగ్నెటిక్‌ ఇంక్‌ క్యారెక్టర్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ’ వాడకం ప్రారంభం.
మతకలహాల కారణంగా మీరట్‌లో జరిగిన అల్లర్లలో పోలీసుల కాల్పుల్లో ఒక వర్గానికి చెందిన 50 మంది దుర్మరణం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top