స్వతంత్ర భారతి:1993/2022 స్టాక్‌ మార్కెట్‌లోకి ఇన్ఫోటెక్‌ 

Azadi Ka Amrit Mahotsav Infotech In Stock Market - Sakshi

ఆర్థిక సరళీకరణల ప్రభావంతో అప్పుడప్పుడే దేశం కుదురుకుంటున్న తరుణంలో హర్షద్‌ మెహ్‌తా కుంభకోణం స్టాక్‌ మార్కెట్‌ల వెన్ను విరిచింది. సరిగ్గా ఆ సమయంలో భారతీయ పెట్టుబడి విపణిలోకి ఎన్‌.ఆర్‌.నారాయణమూర్తి నాయకత్వంలోని ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ పెద్ద చప్పుడేమీ చేయకుండానే ప్రవేశించింది. 10 రూపాయల ముఖ విలువ కలిగిన ఆ కంపెనీ షేర్‌ 95 రూపాయల వద్ద లిస్ట్‌ అయింది! షేర్‌ మార్కెట్‌ పండితులు దానిని ఆ దశాబ్దంలోనే గొప్ప లాభసాటి బేరంగా అభివర్ణించారు.

రూ. 9,500 పోసి కొన్న వంద షేర్ల విలువ పదేళ్ల కాలంలో దాదాపు 60 లక్షలకు పెరిగింది! ఇన్ఫోసిస్‌ షేర్లు కొన్నవారిలో కొందరు లక్షాధికారులైతే.. మరికొందరు కోటీశ్వరులయ్యారు. ఆ పదేళ్లల్లో ఇన్ఫోటెక్‌ రంగంలో ఏడు లక్షల వరకు ఊద్యోగావకాశాలు ఏర్పడ్డాయి. 1990లలో దేశంలో ఎంతో సంపదను సృష్టించిన రంగం, భారతదేశాన్ని మొదటిసారిగా ప్రపంచ స్థాయిలో ధైర్యంగా పోటీకి నిలబెట్టిన రంగం కూడా ఇన్ఫోటెక్కే. 

ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు

  • కశ్మీర్‌లో ‘ఆల్‌ పార్టీస్‌ హురియత్‌ కాన్ఫరెన్స్‌’ ఆవిర్భావం.
  • దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉగ్రవాద పేలుళ్లు. 260 మంది దుర్మరణం.
  • మహరాష్ట్రలోని లాతూర్‌లో భూకంపం. సుమారు 9,748 మంది దుర్మరణం. 

(చదవండి: మాల్గుడి మహాశయుడు: ఆర్‌.కె.నారాయణ్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top