
లక్నో: దేశ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. జమ్మూ కశ్మీర్‌లో క్రిష్ట్‌వార్‌లో క్లౌడ్ బరస్ట్ కారణంగా భారీ ప్రాణ నష్టం వాటిల్లిగా, యూపీలోని గోరఖ్‌పూర్‌లో ఎనిమిదేళ్ల చిన్నారి తెరిచి ఉంచిన నాలాలో పడి దుర్మరణం చెందింది. స్కూల్‌కు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ దారుణం చోటు చేసుకుంది. స్కూల్ నుంచి తన తమ్ముడితో కలిసి వస్తున్న అఫ్రీన్ అనే ఎనిమిదేళ్ల చిన్నారి నాలాలో పడిపోయింది.
వర్షాల కారణంగా నాలాలు మర్మమత్తులు చేసే క్రమంలో ఒక చోట నాలాను తెలిచే ఉంచారు. అది నీటిలో కలిసిపోయి ఉండటంతో నాలా ఎక్కుడ ఉందనే విషయాన్ని ఆ చిన్నారులు గమనించలేకపోయారు. ఈ క్రమంలోనే అఫ్రీన్ నాలాపై అడుగేయగా అందులోకి జారిపోయింది. దాంతో అక్కడ అఫ్రీన్‌ను నాలాలోకి జారిపోవడంతో తమ్ముడు గట్టిగా అరవగా, స్థానికులు వచ్చి రక్షించే యత్నం చేశారు. అప్పటికే ఆ చిన్నారి 50 మీటర్ల లోతులోకి ఆ చిన్నారి వెళ్లిపోవడంతో ప్రాణాం కోల్పోయింది.
ఆ నాలా నుంచి తిరిగి తీసిన తర్వాత ఆ చిన్నారికి సీపీఆర్ చేశారు స్థానికులు. అయిన్పటికీ చలనం లేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆ చిన్నారి మృత్యువాత పడినట్లు డాక్టర్లు ధృవీకరించారు.