
ముంబై: దేశవ్యాప్తంగా గణేశుని ఉత్సవాల సందడి మొదలయ్యింది. మహారాష్ట్రలోని ముంబైలో కొలువైన ప్రసిద్ధ ‘లాల్‌బాగ్చా రాజా’ తొలిచూపులోనే అందరినీ ఆకట్టుకుంటున్నాడు.
భక్తులలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతున్నాడు. ఈ ఏడాది ‘లాల్‌బాగ్చా రాజా’ ఊదా రంగు దుస్తులు ధరించి, తలపై కిరీటం, చేతిలో చక్రం తిప్పుతూ అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు.
‘లాల్‌బాగ్చా రాజా’ సన్నిధి భక్తులకు ఎంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని పంచుతోంది. ఈ ఏడాది గణేష్ చతుర్థి ఆగస్టు 27న మొదలై 10 రోజుల పాటు కొనసాగనుంది.
ఉత్సవాలకు హాజరయ్యే భక్తులు ‘లాల్‌బాగ్చా రాజా’ను దర్శనం చేసుకునేందుకు 40 గంటల పాటు క్యూలో నిలుచునే పరిస్థితులు కూడా కనిపిస్తుంటాయి.