అంతరిక్షంలో ఉన్న రాకేశ్‌ శర్మను ఇందిర ఏమడిగారో తెలుసా?

37 Years Ago Rakesh Sharma Became The First Indian Went Space - Sakshi

అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు ఎవరంటే..! ఠక్కున చెప్పే పేరు రాకేశ్‌ శర్మ. మొట్టమొదటి సారిగా భారతీయుని అంతరిక్షయాత్ర కల సాకారమైంది ఈ రోజునే. రష్యా సహాకారంతో రాకేశ్‌శర్మ రోదసీలోకి వెళ్లి నేటికి 37 ఏళ్లు. సోవియట్‌ రష్యాకు చెందిన సోయజ్‌ టి-11 వ్యోమ నౌక ద్వారా 1984 ఏప్రిల్‌ 3 న  ఆయన అంతరిక్షంలోకి వెళ్లాడు. రాకేశ్‌ శర్మ  రోదసీలో సుమారు 8 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు.  అంతరిక్షం నుంచి భారత్‌ ఎలా కనిపిస్తోందని అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ అడిగిన  ప్రశ్నకు రాకేశ్‌ శర్మ  కవి ఇక్బాల్ రచించిన "సారే జహాసే అచ్చా" (మిగతా ప్రపంచం కంటే ఉత్తమం) అంటూ సమాధానమిచ్చారు.

కాగా, ప్రస్తుతం రాకేశ్‌ శర్మ జీవితంపై బాలీవుడ్‌లో ‘సారే జహాసే అచ్చా’  బయోపిక్‌ సినిమా రానుంది. ఈ సినిమాలో షారుఖ్‌ నటిస్తున్నాడు. ఈ ఏడాది సినిమాను రిలీజ్‌ చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఇక భారత్‌ మానవసహిత అంతరిక్ష యాత్రకు గగన్‌యాన్‌ మిషన్‌ను ఇస్రో పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. అందుకుగాను  మిషన్‌లో భాగంగా వ్యోమగాములుగా ఎంపికైన నలుగురు భారతీయులు, రష్యాలో ఏడాది శిక్షణ కోర్సును పూర్తి చేసుకున్నారు. మానవ సహిత యాత్ర కోసం భారత ప్రభుత్వం పదివేల కోట్లను కేటాయించింది.

చదవండి: Gaganyaan Mission: మరో కీలక ముందడుగు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top