భారత రాజ్యాంగంపై అవగాహన ఉండాలి | - | Sakshi
Sakshi News home page

భారత రాజ్యాంగంపై అవగాహన ఉండాలి

Nov 27 2026 2:02 AM | Updated on Nov 27 2026 2:02 AM

కోస్గి రూరల్‌: భారత రాజ్యాంగంపై ప్రతి ఒక్క రూ అవగాహన కలిగి ఉండాలని జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి వడ్లూరి సుస్మిత అ న్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం పట్టణంలోని ఉర్దూ మీడి యం ఉన్నత పాఠశాలలో చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించగా.. ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి పునాది వంటిదని, పౌరులకు స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువలను అందిస్తాయని వివరించారు. కుల, మత, లింగ విభేదాలు లేకుండా అందరికి సమానహక్కులతో పాటు విధులను గుర్తు చేస్తుందన్నారు. రాజ్యాంగ ఆశయం గౌరవిస్తూ బాధ్యతగల పౌరులుగా వెలగడమే రాజ్యాంగ దినోత్సవానికి నిజమైన అర్థమన్నారు. పోక్సో, సైబర్‌క్రైం, బాల్యవివాహాలు, మూఢ నమ్మకాలు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ చంద్రశేఖర్‌, బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శి రాజలింగం, పర్వీన్‌బేగం, బాలకృష్ణగౌడ్‌, జైపాల్‌, ప్రధానోపాధ్యాయుడు ఖాజమైనుద్దీన్‌, పద్మ, ఆర్షియ జీనత్‌, నస్రిన్‌ సూల్తానా, అక్రం దుర్హాని, హనీఫ్‌, కాశన్న, మాణిక్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement