కార్పొరేట్‌ అనుకూల విధానాలు వీడాలి | - | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ అనుకూల విధానాలు వీడాలి

Nov 27 2026 2:02 AM | Updated on Nov 27 2026 2:02 AM

నారాయణపేట: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ అనుకూల విధానాలను వీడాలని, దేశ రై తులకు రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు తక్ష ణమే అమలు చేయాలని సంయుక్త కిసాన్‌మోర్చా నాయకులు డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో రై తు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐయూకే జిల్లా కార్యదర్శి బి.యాదగిరి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్‌ మాట్లాడుతూ.. రైతు ఉద్యమం సందర్భంగా ప్రధాని మోదీ రైతులకు క్షమాపణలు చెబుతూ, సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన లిఖితపూర్వక హామీలను ఇప్పటికై నా నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.ఎల్‌నినో ప్రభావం, అకాల వర్షా లు, కరువు పరిస్థితులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, పంటలు చేతికందకపోవడం, పెట్టుబడి భారం పెరగడంతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటలకు ఉత్పత్తి వ్యయంపై 50 శాతం అదనంగా కలిపి కనీస మద్దతు ధర నిర్ణయించి చట్టబద్ధంగా అమలు చేయాలని కోరారు. ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు సాధారణ పంటలకు ఎకరాకు రూ.50 వేలు, వాణిజ్య పంటలకు రూ.లక్ష చొప్పున పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. పంటల బీమాను సమర్థవంతంగా అ మలు చేయడంతో పాటు పెండింగ్‌ సాగునీటి ప్రా జెక్టులను త్వరగా పూర్తి చేయాలని, రైతుల రుణా లు మాఫీ చేసి కొత్త పంట రుణాలు అందించాలని కోరారు. రైతుల ఆదాయాన్ని పెంచుతామని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్మికులకు నష్టం కలిగించే లేబర్‌ కోడ్స్‌ను రద్దు చేసి, స్వాతంత్య్రానికి పూర్వం నుంచి కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. రైతులు, కౌలు రైతులు, మహిళా రైతులు, వ్యవసాయ కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని, రైతుల ఐక్యతే సమస్యల పరిష్కారానికి మార్గమని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు, ప్రజా, కార్మిక సంఘాల నాయకులు అంజిలయ్యగౌడ్‌, బాల్‌రాం, బి.నర్సింహ, రామకృష్ణ, చెన్నారెడ్డి, కొండా నర్సింహులు, బాలకృష్ణ, దస్తప్ప, మహేష్‌, రామకృష్ణ, మల్లేష్‌, కాశప్ప, అంజి, సాయి, పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement