సస్యరక్షణ, మెళకువలతో అధిక దిగుబడులు | - | Sakshi
Sakshi News home page

సస్యరక్షణ, మెళకువలతో అధిక దిగుబడులు

Nov 27 2026 2:02 AM | Updated on Nov 27 2026 2:02 AM

దామరగిద్ద: యాసంగి సాగులో ముందస్తు సస్యరక్షణ చర్యలు, మెళకువలు పాటిస్తూ తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం జిల్లా కో–ఆర్డినేటర్‌, భూసార శాస్త్రవేత్త ఈటెల సత్యనారాయణ అన్నారు. గురువారం మండలంలోని మద్దెల్‌బీడ్‌లో రైతులు సాగు చేసిన జొన్న, ఉల్లి, వేరుశనగ పంటలతో పాటు కూరగాయల సాగును పరిశీలించారు. పంటల ప్రస్తుత పరిస్థితి, తెగుళ్ల లక్షణాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. టమాటలో ఎండు తెగులు నివారణ పద్ధతులు, మొక్కల ఆరోగ్య పరిరక్షణ, అవసరమైన రక్షణ చర్యలను వివరించారు. వేరుశనగలో కాండం కుళ్లుతెగులుతో ఆకుల అంచులు ఎండిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. రైతు శంకర్‌తో మాట్లాడి కాకర సాగులో సౌరశక్తితో పనిచేసే లైట్‌ ట్రాఫ్‌ల ఏర్పాటు, మల్చింగ్‌ పద్ధతిని అవలంబిస్తూ పొందుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రైతులు భాస్కర్‌, నర్సప్ప, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement