స్వచ్ఛభారత్‌ లక్ష్యం దిశగా పయనం | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛభారత్‌ లక్ష్యం దిశగా పయనం

Nov 27 2026 2:02 AM | Updated on Nov 27 2026 2:02 AM

నర్వ: స్వచ్ఛభారత్‌ అభియాన్‌ లక్ష్యాల దిశగా పయనిద్దామని డీఆర్డీఓ వెంకట్రాములు అన్నారు. గురువారం మండలంలోని జక్కన్నపల్లిలో నిర్వహించిన నాలుగు రకాల చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో మొదటిసారి నాలుగు రకాల చెత్తను వేరుచేసేందుకు వినియోగించే బుట్టలను గ్రామంలో పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఇందుకు కృషిచేసిన సర్పంచ్‌ గుండ్రాతి అనిత, దాత యాంకి వెంకటేష్‌ను అయన అభినందించారు. గ్రామంలో చెత్త సేకరణకు వచ్చే ట్రాక్టర్‌లో వేర్వేరుగా సేకరించిన చెత్తను వేయాలని సూచించారు. గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా పంచాయతీ సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల అభివృద్ధితో పాటు ప్రజారోగ్య పరిరక్షణకు అందరు కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసులు, ఎంపీఓ రాఘవేందర్‌, సర్పంచ్‌ గుండ్రాతి అనిత, సర్పంచ్‌ వాకిటి నర్సింహ, పంచాయతీ కార్యదర్శి రాజు, నాయకులు గుండ్రాతి రామన్‌గౌడ్‌, సత్యన్న పాల్గొన్నారు.

ఒకేరోజు 20 ఇంకుడుగుంతల మార్కింగ్‌..

కలెక్టర్‌ ఆదేశాల మేరకు మండల కేంద్రాన్ని స్పెషల్‌ డ్రైవ్‌గా ఎంపిక చేసి ఒకే రోజు 20 ఇంకుడు గుంతలకు మార్కింగ్‌ ఇచ్చినట్లు ఎస్‌బీఎం కో–ఆర్డినేటర్‌ మాలిక్‌ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఓ వెంకట్రాములు పాల్గొని మాట్లాడుతూ.. చేసిన పనుల బిల్లులు వారం రోజుల్లో మండల కేంద్రంలో నేరుగా అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement