ఒడిశా కార్మికుల తరలింపు | - | Sakshi
Sakshi News home page

ఒడిశా కార్మికుల తరలింపు

Nov 27 2026 2:02 AM | Updated on Nov 27 2026 2:02 AM

మరికల్‌: బతుకుదెరువు కోసం ఒడిశా నుంచి జిల్లాకు వచ్చిన వలస కార్మికులను కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక ఆదేశాల మేరకు గురువారం అధికారులు తిరిగి స్వరాష్ట్రానికి పంపించారు. మండల శివారులో ఉన్న ఇటుక బట్టీల్లో పని చేసేందుకు గతవారం 20 మంది కార్మికులు వచ్చారు. ఇక్కడ సమస్యలు ఎదురవుతున్నాయని.. తమను తీసుకెళ్లేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఎక్స్‌ వేదికగా ఒడిశాలోని ఓ స్వచ్ఛంద సంస్థకు సమాచారం అందించారు. వారు జిల్లా కలెక్టర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా కార్మికశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఎంపీడీఓ పృథ్వీరాజ్‌, ఎస్‌ఐ రాంలాల్‌నాయక్‌ గురువారం ఇటుక బట్టీల దగ్గర ఉన్న వలస కార్మికులను గుర్తించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బట్టీలో పని చేసేందుకు తమ దగ్గర అడ్వాన్స్‌గా డబ్బులు తీసుకున్నారని యజమాని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కార్మికుల హక్కులను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తు.. వారిని సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి ఒడిశాకు వెళ్తారని అధికారులు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement