ఆలయ అభివృద్ధికి కృషి : మంత్రి వాకిటి | - | Sakshi
Sakshi News home page

ఆలయ అభివృద్ధికి కృషి : మంత్రి వాకిటి

Oct 15 2026 11:59 AM | Updated on Oct 15 2026 11:59 AM

మక్తల్‌: స్థానిక శ్రీ పడమటి ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం ఆలయంలో గరుడ స్తంభం, గడపరాయి ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆయన హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి సుమారు రూ.కోటి ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. రాజగోపురం నిర్మాణానికి రూ.50 లక్షలు, కోనేరుకు రూ.40 లక్షలు, మిగతా వాటికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఉత్సవాల వరకు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఉత్సవాలను గతంలో కంటే వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ ప్రాణేష్‌కుమార్‌, రాఘవేంద్రస్వామి, బీకేఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ బాలకృష్ణారెడ్డి, పుర చైర్‌పర్సన్‌ వాకిటి మానస, కాంగ్రెస్‌పార్టీ పట్టణ అధ్యక్షుడు రవికుమార్‌, కౌన్సిలర్లు సరిత, రహీం పటేల్‌, శ్రీవిద్య, జుట్ట అనిత, వాకిటి హన్మంతు, కట్ట సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎత్తిపోతల పనులు

అడ్డుకున్న రైతులు

నారాయణపేట: తమ భూములకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలంటూ బుధవారం జయమ్మ చెరువుకట్ట నిర్మాణానికి సంబంధించిన పనులను రైతులు అడ్డుకున్నారు. నిర్మాణ ప్రాంతానికి పొక్లెయిన్‌, వాహనాలు రాగా భూమిపూజ, ఇతర పనులు కొనసాగించవద్దని స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి గ్రామంలోని రైతువేదికకు చేరుకొని రైతులతో సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భూములు కోల్పోతున్న ప్రతి రైతుకు పరిహారం అందించే బాధ్యత తనదేనని.. నష్టం జరగకుండా కృషి చేస్తానని, అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. భూమిపూజ కొనసాగించేందుకు రైతులు సహకరించాలని కోరారు.

మీడియా చిత్రీకరణపై అభ్యంతరం..

రైతులతో సమావేశం జరుగుతున్న సమయంలో మీడియా ప్రతినిధులు ఫొటోలు, వీడియోలు తీయడంపై శివకుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తీసిన ఫొటోలు, వీడియోలను తొలగించాలని విలేకర్లకు సూచించారు. పెరపళ్ల రైతుల సమస్యలను ప్రచారం చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానిస్తూ.. మీడియా జో క్యం చేసుకోవద్దని అసహనం వ్యక్తం చేశారు.

రేపు కొత్త బార్ల కేటాయింపు

నారాయణపేట: జిల్లాలోని మక్తల్‌, మద్దూర్‌ ప్రాంతాలకు మంజూరైన బార్ల కేటాయింపునకు 16వ తేదీన శుక్రవారం ఉదయం 9 గంటలకు కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు ప్రొహిబిషన్‌న్‌ అండ్‌ ఎకై ్స జ్‌శాఖ సీఐ సైదులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులందరూ నిర్ణీ త సమయానికి హాజరుకావాలని సూచించా రు. ఎంపిక ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు సూచనలు పాటించాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement