అప్రమత్తతతోనే సైబర్‌ నేరాల నియంత్రణ | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తతతోనే సైబర్‌ నేరాల నియంత్రణ

Oct 15 2026 11:59 AM | Updated on Oct 15 2026 11:59 AM

నారాయణపేట: అప్రమత్తతతోనే సైబర్‌ నేరాలను నియంత్రించవచ్చని.. అనుమానాస్పద ఫోన్‌కాల్స్‌, సందేశాలు, లింకులకు స్పందించకుండా నిజానిజాలను నిర్ధారించుకోవాలని ఎస్పీ డా. వినీత్‌ సూచించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ‘ఆగండి.. ఆలోచించండి.. అడుగు వేయండి’ అనే సైబర్‌ భద్రత అవగాహన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. విద్యాసంస్థలు, మార్కెట్లు, షాపింగ్‌మాల్స్‌, సూపర్‌ మార్కెట్లు, నివాస సంక్షేమ సంఘాలు, మతపరమైన ప్రదేశాలు, జనసమూహ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. అవగాహన ర్యాలీలు, వాకథాన్‌లు, సైకిల్‌ ర్యాలీలు, వీధి నాటకాలు, స్కిట్లు, పోస్టర్‌ ప్రదర్శనలు, క్విజ్‌లు, ప్రతిజ్ఞ కార్యక్రమాలు, సోషల్‌ మీడియా ప్రచారాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement