దామరగిద్ద: మండలంలోని కాన్‌కుర్తి పీఎంశ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో 70వ ఎస్జీఎఫ్ అండర్–14 రాష్ట్రస్థాయి రెజ్లింగ్ టోర్నమెంట్ కమ్ సెలెక్షన్స్ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భగా జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ విజయ్‌కుమార్, సర్పంచ్ నారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు కాన్‌కుర్తి జెడ్పీ ఉన్నత పాఠశాల వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులకు అన్ని వసతులు కల్పించామని తెలిపారు. ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి సహకారంతో అన్ని ఏర్పాటు చేశామన్నారు. డీవైఎస్‌ఓ వెంకటేష్ మాట్లాడుతూ.. మారుమూల గ్రామాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకే గ్రామీణ ప్రాంతం వేదికగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 200 మంది క్రీడాకారులు, 50 మంది కోచ్‌లు, మేనేజర్లు క్రీడల్లో భాగస్వాములైనట్లు వివరించారు. అనంతరం క్రీడాజ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో రెజ్లింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నర్సింములు, ఎంఈఓ సురేష్, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, ఉప సర్పంచ్ యశోద, వెంకటప్ప, బాలరాజు, పీడీ, పీఈటీలు నర్సింహులు, రత్నయ్య, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యానగుందిలో
నవరాత్రి ఉత్సవాలు
నారాయణపేట:యానగుంది క్షేత్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు స్వామివారి మూలవిగ్రహాన్ని రంగురంగుల పూలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
ప్రత్యేక
ఆలంకరణలో
స్వామివారు


