బీమా అమలు చేయాలి.. | - | Sakshi
Sakshi News home page

బీమా అమలు చేయాలి..

Oct 12 2026 8:10 AM | Updated on Oct 12 2026 8:10 AM

బీమా అమలు చేయాలి..

ప్రస్తుతం కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఫసల్‌బీమా యోజనను కచ్చితంగా అమలు చేయాలి. ఇప్పటికే వర్షాలు లేక పంటల సాగుకు పెట్టిన పెట్టుబడి కూడా చేతికందే పరిస్థితి లేదు. కేంద్రం అమలు చేస్తున్న ఫసల్‌బీమాతో రైతులకు మేలు చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వం మరో ఆలోచన లేకుండా పథకం అమలు చేసి రైతులకు న్యాయం చేయాలి.

– వెంకట్‌రెడ్డి, రైతు, మరికల్‌

ఎండిన పంటలకు వర్తింపజేయాలి..

ఈ ఏడాది వర్షాలు లేక తీ వ్రమైన ఎండలకు భూగ ర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోవడంతో పంటలకు పెట్టిన పెట్టుబడులు చేతికందని పరిస్థితి నెలకొంది. ఎండిన పత్తి, వరి పంటలకు ఫసల్‌బీమా వర్తింపజేయాలి. ఇలాంటి పథకాలు అమలు చేసి రైతులను ఆదుకోవాలి.

– వెంకటయ్య, రైతు, మరికల్‌

ఆదేశాలు రాలేదు..

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ఫసల్‌బీమా పథకాన్ని రాష్ట్రంలోని గత ప్రభుత్వం నిలిపివేసింది. ప్రస్తుతం ఎల్‌నినో కారణంగా ఏర్పడిన కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో వచ్చే యాసంగి నుంచి ఫసల్‌ బీమా అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే రైతుల వివరాలు సేకరిస్తాం.

– సక్రియానాయక్‌, జిల్లా వ్యవసాయ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement